అమెరికా యుద్ధ నౌకను ‘తరిమేశాం’..సౌత్ సీ మాదే..చైనా.. తిప్పికొట్టిన అగ్ర రాజ్యం ..సముద్ర జలాల హక్కులపై రగడ

| Edited By: Phani CH

Jul 12, 2021 | 8:12 PM

సౌత్ చైనా సీ లో ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తాము 'తరిమేశామని' చైనా ప్రకటించుకుంది. ఇది వివాదాస్పద పరాసెల్ ద్వీప సమీపంలో తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించింది.

అమెరికా యుద్ధ నౌకను తరిమేశాం..సౌత్ సీ మాదే..చైనా.. తిప్పికొట్టిన అగ్ర రాజ్యం ..సముద్ర జలాల హక్కులపై రగడ
We Drove Away Us
Follow us on

సౌత్ చైనా సీ లో ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తాము ‘తరిమేశామని’ చైనా ప్రకటించుకుంది. ఇది వివాదాస్పద పరాసెల్ ద్వీప సమీపంలో తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించింది. నిజానికి సౌత్ చైనా సీ పై చైనాకు హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు గత ఏడాది ఇదే రోజున (సోమవారం) రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌక ఈ జలాల్లోకి ఎంటరైంది. అయితే చైనా దీన్ని తప్పు పడుతూ.. తమ ప్రభుత్వ అనుమతి లేనిదే ఈ నౌక ఇక్కడికి ప్రవేశించిందని, ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సదర్న్ థియేటర్ కమాండ్ చేసిన ఈ హెచ్చరికను అమెరికా నేవీ దళం కొట్టి పారేసింది. ఈ ద్వీప పరిధిలో ప్రవేశించే స్వేచ్ఛ, హక్కు తమకు ఉన్నాయని, ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆమోద యోగ్య,మేనని పేర్కొంది. మీ సార్వభౌమాధికారాన్ని తామేమీ అతిక్రమించలేదని కౌంటర్ ఇచ్చింది.

అంతర్జాతీయ చట్టాలు ఎక్కడ వర్తించినా..అమెరికా నౌకలు ఆయా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాయి.. మమ్మల్ని మీరు ఆపలేరు’ అని అమెరికా నేవీ అధికారులు చైనాకు స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ని తాము పాటించవలసిన అవసరం లేదని చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. గత కొన్నేళ్లుగా సౌత్ చైనా సీ పై అమెరికా-..చైనా మధ్య రగడ కొనసాగుతూనే ఉంది.. ఈ సముద్ర జలాల్లో 90 శాతం తమవేనని చైనా చెప్పుకొంటుండగా..అమెరికా దీన్ని ఖండిస్తోంది. అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ని మీరు అతిక్రమిస్తున్నారని పదేపదే ఆరోపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కు చైనా అభ్యంతరం.. లడాఖ్ వద్ద బ్యానర్లతో సైనికుల నిరసన

Aamir Khan: అమీర్ ఖాన్‏పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…