Viral Video: ఎయిర్‌పోర్టు బ్యాగేజీ కన్వేయర్‌పై మృతదేహం..? ప్రయాణికుల ప్రాణాలు అరచేతిలో..!

|

May 25, 2022 | 8:50 PM

సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి, కొన్ని షాక్‌కు గురిచేసేవిగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇలా రకరకాల వీడియోలు

Viral Video: ఎయిర్‌పోర్టు బ్యాగేజీ కన్వేయర్‌పై మృతదేహం..? ప్రయాణికుల ప్రాణాలు అరచేతిలో..!
Dead Body
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి, కొన్ని షాక్‌కు గురిచేసేవిగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇలా రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా లండన్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ఓ పాత వీడియో తాజాగా మరోమారు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. తమ లగేజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రయాణికులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో లండన్‌ ఎయిర్‌లో తమ లగేజ్ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రయాణికులు ఓ వింత వస్తువును చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. బాబోయ్ ఏంటని భయపడిపోయారు. కన్వేయర్‌ బెల్ట్‌పై పార్సిల్‌లో చుట్టబడిన మృతదేహం వంటి ఆకారం వారిని తీవ్రమైన భయాందోళనకు గురిచేసింది. చివరకు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. . ఇంతకీ అక్కడ వారికి కనిపించిన వస్తువు ఏంటీ..? ఎందుకు వారు అంతలా భయపడిపోయారు అన్నది పరిశీలించినట్టైతే…

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు 2017కు సంబంధించిన పాత వీడియోగా తెలిసింది. కానీ, సోషల్‌ మీడియా వేదికగా మరోసారి నెట్టింట్లోచక్కర్లు కొడుతోంది. ఇందులో విమానం దిగిన ప్యాంసిజర్లు తమ సామాన్ల కోసం కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ వింత పార్సిల్‌ బెల్ట్‌ మీదకు వచ్చింది. అది అచ్చం మనిషి శవాన్ని ప్యాక్‌ చేసిన ఆకారంలో ఉంది. అది చూసిన ప్యాసింజర్స్‌ ఒక్కసారిగా కంగుతిన్నారు. బాబోయ్‌ పార్శీల్‌లో డెడ్‌బాడీ వచ్చిందా..? అంటూ భయపడిపోయారు. కానీ, ఆ వెంటనే అధికారులు, ఆ వస్తువు సంబంధిత వ్యక్తులు వచ్చిన అసలు సంగతి వివరించారు..ఆ పార్శిల్‌లో ఉన్నది ఓ బొమ్మ ల్యాంప్‌ అని చెప్పారు. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బిత్తరపోయి ఒకరిముఖం ఒకరు చూసుకుని తెగ నవ్వుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ఖాతలో తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది వీక్షించారు.