Disability Benefit: ప్రభుత్వ పెన్షన్‌ కోసం 15 ఏళ్లు అంధురాలిగా నటించిన మహిళ.. సెల్ ఫోన్ ఆపరేట్‌తో దొరికిన వైనం..

|

Apr 01, 2023 | 11:18 AM

ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కోసం ఓ మహిళ తానొక అంధురాలిగా నటించింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 ఏళ్లు అలా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి వికలాంగ పెన్షన్‌ అందుకుంది. ఎంత తెలివైనవారైనా ఎక్కడో అక్కడ వారు చేసే చిన్నపొరపాటు వారి బండారాన్ని బయటపెడుతుంది. ఇక్కడా అదే జరిగింది.

Disability Benefit: ప్రభుత్వ పెన్షన్‌ కోసం 15 ఏళ్లు అంధురాలిగా నటించిన మహిళ.. సెల్ ఫోన్ ఆపరేట్‌తో దొరికిన వైనం..
Disability Benefit
Follow us on

ప్రభుత్వాలు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఆసరా ఉండేందుకు వారికి పెన్షన్‌ రూపంలో నెల నెలా కొంత నగదును అందిస్తాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. అయితే ఎప్పుడో అప్పడు పట్టుబడతారు.. మొత్తానికే మోసపోతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఇటలీలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కోసం ఓ మహిళ తానొక అంధురాలిగా నటించింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 ఏళ్లు అలా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి వికలాంగ పెన్షన్‌ అందుకుంది. ఎంత తెలివైనవారైనా ఎక్కడో అక్కడ వారు చేసే చిన్నపొరపాటు వారి బండారాన్ని బయటపెడుతుంది. ఇక్కడా అదే జరిగింది.

ఇటలీకి చెందిన ఓ 48 ఏళ్ల మహిళ తాను ఒక అంధురాలిని తెలిపే ధృవపత్రాన్ని ఓ డాక్టర్‌నుంచి సంపాదించింది. ఆపై సామాజిక భద్రత పింఛన్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ధృవీకరణ పత్రాలు చూసి ఆమెకు పింఛన్‌ మంజూరు చేశారు అధికారులు. 15 ఏళ్లలో ఆమె ప్రభుత్వంనుంచి పెన్షన్‌ రూపంలో రెండు లక్షల 8 వేల యూరోలు అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు కోటి 8 లక్షల రూపాయలు పొందింది. ఓ రోజు ఆమె పనిమీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన ఆమె సెల్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేయడం, పైళ్లపై ఎంతో సునాయాసంగా సంతకాలు పెట్టడం గమనించారు అధికారులు. అంతే అమ్మడు దొరికిపోయింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే ఆమెకు అంధురాలిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన వైద్యుడిపై కేసు నమోదు చేసి విచారణ చేప్టటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..