చదువుకోవాల్సిన పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియాలోని ఒక ఉన్నత పాఠశాలలో మరో ముష్కరుడి దాడి చేశాడు. ఈ ఘటనలో కాల్పుల్లో గణిత ఉపాధ్యాయుడు సహా నలుగురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతమంతా లాక్‌డౌన్ విధించారు. పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు 14 ఏళ్ల బాలుడు. పేరు కోల్ట్ గ్రే అని తెలుస్తోంది.
జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉదయం 10:23 గంటలకు విండర్ సిటీలోని అపాలాచీ హై స్కూల్‌లో కాల్పులు జరిగినట్లు నివేదించబడింది. సమాచారం అందికున్న పోలీసు బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. స్కూల్ లో ఉన్న స్టూడెంట్స్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నిందితుడిని అరెస్టు చేసినట్లు బోరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 14 ఏళ్ల బాలుడు ఈ దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఆ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి. నిందితులు ఏఆర్-15 తరహా రైఫిల్‌ను ఉపయోగించాడు. అయితే ఆ బాలుడికి రైఫిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ? స్కూల్‌లోకి ప్రవేశించి ఎందుకు కాల్పులు జరిపాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం ఘటనపై విచారణ కొనసాగుతోంది.
కోల్ట్ గ్రే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవాడు – క్లాస్‌మేట్
దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి చెప్పరు. అంతేకాదు ప్రస్తుతం నిందితుడు కోల్ట్ గ్రేకు హత్య చేసిన వ్యక్తులతో మునుపటి సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. CNNతో మాట్లాడుతున్నప్పుడు అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని కోల్ట్ పాఠశాల విద్యార్థిని లైలా సాయిరత్ అన్నారు. అంతేకాదు కోల్ట్ గ్రే ఎక్కువగా మౌనంగా ఉంటాడు. స్కూల్ కి వచ్చినా తరగతులకు హాజరుకాడు అని చెప్పాడు నిందితుడు కోల్ట్ గ్రే .. స్కూల్ క్లాస్‌మేట్. అంతేకాదు ఎవరైనా సరే కోల్ట్ గ్రే తో మాట్లాడినప్పటికీ, అతని ప్రతిస్పందన ఒక పదం లేదా చిన్న వాక్యాలలో ఉంటుందని చెప్పాడు.
A 14-year-old student killed two fellow students and two teachers, while wounding nine others, in a shooting at a Georgia high school, just weeks after classes began, authorities said https://t.co/Ym64UCP38l pic.twitter.com/DZmsDfOz16
— Reuters (@Reuters) September 4, 2024
స్కూల్ కాల్పులు, నలుగురి మృతి వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో నిందితుడిని ‘రాక్షసుడు’ గా అభివర్ణించారు.
అయితే గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో తుపాకీ హింస పెరిగింది. అనేక పాఠశాలలు, కళాశాలలపై కూడా ముష్కరులు దాడి చేశారు. అమాయక పిల్లలు చనిపోయారు. 2007లో వర్జీనియా టెక్ సిటీలో జరిగిన కాల్పుల్లో 30 మంది మృతి చెందడం అత్యంత దారుణం. ఇలాంటి ముష్కరుల దాడులు నిరంతరం జరుగుతుండటంతో దేశంలోని తుపాకీ చట్టాలపై అనేకసార్లు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తుపాకీ చట్టాలను కఠినతరం చేయాలనే డిమాండ్ కూడా చాలాసార్లు వినిపిస్తోనే ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..