USA: భారత్‌పై స్వరం మారుస్తున్న అమెరికా.. దర్యాప్తుకు సహకరించాలని అభ్యర్థన

|

Sep 26, 2023 | 4:37 PM

కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసు విషయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని ఇండియాకు తాము ప్రైవేటుగా.. బహిరంగంగా కోరామని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ చెప్పారు. అయితే ఈ ఘటనపై కచ్చితంగా విచారణ జరగాలని.. దోషులకు శిక్షపడాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తన రోజువారీ మీడియా సమావేశంలో మిల్లర్‌ మాట్లాడుతూ.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణల వల్ల తాము తీవ్రంగా కలత చెందాని అన్నారు.

USA: భారత్‌పై స్వరం మారుస్తున్న అమెరికా.. దర్యాప్తుకు సహకరించాలని అభ్యర్థన
Justin Trudeau And Modi
Follow us on

కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసు విషయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని ఇండియాకు తాము ప్రైవేటుగా.. బహిరంగంగా కోరామని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ చెప్పారు. అయితే ఈ ఘటనపై కచ్చితంగా విచారణ జరగాలని.. దోషులకు శిక్షపడాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తన రోజువారీ మీడియా సమావేశంలో మిల్లర్‌ మాట్లాడుతూ.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణల వల్ల తాము తీవ్రంగా కలత చెందాని అన్నారు. అలాగే మా కెనడా భాగస్వాములతో కూడా టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే దోషులకు శిక్షపడేలా కెనడా దర్యాప్తును కొనసాగించడం ముఖ్యమని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అలాగే ఈ దర్యాప్తుకు కూడా సహకరించాలని తాము ఇండియాను బహిరంగంగా.. అలాగే ప్రేవేటుగా అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. ఇలాగే ఓ రిపోర్టర్‌ అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆయన ఈ విధంగా తన సమాధానాన్ని ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో దోషులను గుర్తించేందుకు ఈ విచారణను జరపాలని కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్‌ కోస్టా కూడా డిమాండ్‌ చేశారు. అయితే ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ఈ విషయంపై స్పందిస్తూ.. నిజ్జర్‌ హత్య విషయంపై తాను చాలా ఆందోళన చెందానని అన్నారు. అంతేకాదు.. దీనిపై అధికారిక బ్రీఫింగ్‌ కూడా కావాలని హౌస్‌ ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా కోరినట్లు చెప్పారు. అలాగే ఈ నేరంపై మనం కచ్చితంగా విచారణను చేపట్టి దోషులను బాధ్యులుగా చేయాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా మరోవైపు భారత్‌-కెనడా దౌత్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అలాగే కెనడా ప్రభుత్వ ప్రకటనల వల్ల కూడా ఖలిస్థానీలు ప్రస్తుతం పేట్రేగి పోతున్నారు. మరో విషయం ఏంటంటే తాజాగా కెనడాలోని ఉన్న భారత దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చారు. అయితే వీటన్నిటికీ కూడా ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే సంస్థ సారథ్యం వహిస్తోంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి భారత దౌత్యవేత్తను బహిష్కరించాలని ఆ సంస్థ ప్రతినిధి జతిందర్‌ సింగ్‌ గ్రేవాల్‌ కెనడా ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో భారత దౌత్యకార్యాలయాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తును పెంచారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని ఆరోపణలు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జీ7 దేశాలు కూడా ఆచితూచి నడుస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన అమెరికా.. భారత్ ఈ కేసు విషయంలో దర్యాప్తుకు సహకరించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..