అమెరికా దళాల అధీనంలో కాబూల్ విమానాశ్రయం.. రోజుకు భారత్ నుంచి రెండు విమాన సర్వీసులకు అనుమతి

| Edited By: Phani CH

Aug 22, 2021 | 12:24 PM

కాబూల్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయాన్ని అమెరికా, నేటో దళాలు తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు రోజుకు రెండు విమానాలను అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అమెరికా దళాల అధీనంలో కాబూల్  విమానాశ్రయం.. రోజుకు భారత్ నుంచి రెండు విమాన సర్వీసులకు అనుమతి
Us Forces Take Control Of Kabul Airport
Follow us on

కాబూల్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయాన్ని అమెరికా, నేటో దళాలు తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు రోజుకు రెండు విమానాలను అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రోజుకు ఈ ఎయిర్ పోర్టు నుంచి 25 విమాన సర్వీసులను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ప్రయాణికులతో బాటు ఆయుధాలు, ఈక్విప్ మెంట్ కూడా వివిధ దేశాలకు తరలుతున్నాయి. ఇండియా తన దేశస్థులను దుషన్ బే, తజికిస్థాన్, ఖతార్ రూట్ల ద్వారా తరలిస్తున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు లేదా రేపు సుమారు 300 మంది భారతీయులను తరలించవచ్చునని తెలుస్తోంది. నిన్న 87 మంది ఈ విమానాశ్రయం నుంచి తజికిస్తాన్ ద్వారా ఇండియాకు బయల్దేరారు. వీరు ఆదివారం ఢిల్లీ చేరుకునే అవకాశాలున్నాయి. ఈ వారారంభంలో భారత వైమానిక దళం మొత్తం 125 మందిని ఢిల్లీకి చేర్చింది. వీరిలో ఆఫ్ఘన్ లో భారత రాయబారి, ఎంబసీ సిబ్బంది ఉన్నారు. ఆఫ్ఘన్ శరణార్థులను ఆదుకోవాలని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్.. అంతర్జాతీయ దేశాలను కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు వీరికి ఆశ్రయం కల్పించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

ఇలా ఉండగా ఇంకా కాబూల్ విమానాశ్రయంలోనే చిక్కుబడిన తమ వారి కోసం ఇండియాలో వారి కుటుంబాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. అక్కడ వారు పడుతున్న కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ! భారత విదేశాంగ శాఖ కాబూల్ విమానాశ్రయ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. కాబూల్ నగరాన్ని తాలిబన్లు వశపరచుకుని నేటికి వారం రోజులైంది. అప్పటి నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అమెరికా, నేటో దళాలు ఇక్కడి ఎయిర్ పోర్టును స్వాధీనపరచుకున్నప్పటి నుంచి కొంతవరకు పరిస్థితి మెరుగుపడినట్టు భావిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: RITES Limited Recruitment: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీ.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.

Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..