Coronavirus: జంతువులనూ వెంటాడుతున్న కరోనా.. జూలోని పులులు, సింహాలకు పాజిటివ్‌..

|

Nov 13, 2021 | 10:54 AM

Big Cats Test Covid-19 Positive: బ్రిటన్‌లోని ఓ పెంపుడు కుక్కకు కరోనావైరసర్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. యజమాని నుంచే.. కుక్కకు కరోనా వ్యాపించినట్లు యూకే

Coronavirus: జంతువులనూ వెంటాడుతున్న కరోనా.. జూలోని పులులు, సింహాలకు పాజిటివ్‌..
Big Cats Test Covid 19 Posi
Follow us on

Big Cats Test Covid-19 Positive: బ్రిటన్‌లోని ఓ పెంపుడు కుక్కకు కరోనావైరసర్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. యజమాని నుంచే.. కుక్కకు కరోనా వ్యాపించినట్లు యూకే వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు.. కుక్క యజమాని కరోనా బారిన పడ్డాడని.. అతని నుంచే వరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం కుక్క కోలుకుంటోందని వెల్లడించారు. అయితే.. ఈ విషయం మరవక ముందే మరో పులులు, సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ జూలో ఎనిమిది జంతువులు కరోనా బారిన పడ్డాయి. విటిలో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్‌ టైగర్‌, ఒక ప్యూమా, రెండు జాగ్వార్‌లు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. వీటిలో నాలుగింటిలో స్వల్ప లక్షణాలు కనిపించగగా.. మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని యూఎస్‌ సెయింట్‌ లూయిస్‌ జూ అధికారులు తెలిపారు.

ఈ ఎనిమిది జంతువులు మినహా.. జూలోని 12 వేల జంతువులు క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదని తెలిపారు. గత నెల రోజులుగా జూ అధికారులు జంతువులకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్‌ వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. కాగా.. జంతువులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో.. వాటినుంచి ప్రజలకు వైరస్‌ సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ వెల్లడించింది. కానీ ప్రజల నుంచి జంతువులకు వైరస్‌ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నట్లు పేర్కొంది.

కాగా.. అంతకు ముందు సెప్టెంబరు నెలలో స్మిత్సోనియన్ నేషనల్ జూలో ఆరు పెద్ద పులకు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Also Read:

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..

Ketchup on Space: మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..