Dangerous Shampoo Recall: అమెరికాలో షాంపూల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించిన కంపెనీ స్వచ్ఛందంగా తమ ఉత్పత్తుల్ని దుకాణాల నుంచి వెనక్కి తీసుకుంది. అధిక మోతాదులో బెంజీన్ ఉన్నట్లు గమనించిన ‘ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ బ్రాండెడ్ షాంపులను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అధిక మోతాదులో బెంజీన్ క్యాన్సర్ వ్యాధికి దారి తీసే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో తయారయ్యే ప్యాంటీన్ షాంపూలతో పాటు హెర్బల్, ఓల్డ్ స్పైస్ బ్రాండ్లకు చెందిన 32 ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
షాంపూల్లో గుర్తించిన బెంజీన్ స్థాయి, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రకటించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి అధిక స్థాయి బెంజీన్‌ను ఉపయోగించినప్పుడు వారిలో లుకేమియా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే .. తమ ఉత్పత్తుల్లో బెంజీన్ అనేది క్రియాశీల పదార్థం కాదని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ పేర్కొంది. ”వెనక్కి తీసుకుంటోన్న ఉత్పత్తుల్ని రోజూవారీగా వినియోగించినా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపవు. వాటిలో, ఆ స్థాయిలో బెంజీన్ లేదు” అని సంస్థ ప్రకటనలో తెలిపింది.
Also Read: