AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశానికే ఫస్ట్‌ లేడీ కానీ..

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆమె పరిస్థితి. డబ్బు, పదవి, హోదా..అన్నీ ఉన్నాయి. కానీ ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఏకాకిగా బతుకుతున్నారు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదిస్తున్నారు. ఇంతకీ ఎవరామె.. ఆమె దేశానికే ఫస్ట్‌ లేడీ. మంచి హోదాలో ఉన్న భర్త. ఇంద్రభవనాన్ని తలపించే శ్వేతసౌధం. ఇంకేం. అన్నీ రాజభోగాలే అనుకుంటాం. ఐతే ఇవన్నీ ఎలా ఉన్నా..ఆమెను ఒంటరితనం వేధిస్తోందట. ఆమె ఎవరో కాదు. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ […]

దేశానికే ఫస్ట్‌ లేడీ కానీ..
Pardhasaradhi Peri
|

Updated on: Dec 09, 2019 | 7:21 PM

Share

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆమె పరిస్థితి. డబ్బు, పదవి, హోదా..అన్నీ ఉన్నాయి. కానీ ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఏకాకిగా బతుకుతున్నారు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదిస్తున్నారు. ఇంతకీ ఎవరామె..

ఆమె దేశానికే ఫస్ట్‌ లేడీ. మంచి హోదాలో ఉన్న భర్త. ఇంద్రభవనాన్ని తలపించే శ్వేతసౌధం. ఇంకేం. అన్నీ రాజభోగాలే అనుకుంటాం. ఐతే ఇవన్నీ ఎలా ఉన్నా..ఆమెను ఒంటరితనం వేధిస్తోందట. ఆమె ఎవరో కాదు. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భార్య మెలనియా ట్రంప్‌..ఆమె వైట్‌హౌస్‌లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారని సంచలన నిజాలు బయటపెట్టింది కేట్‌ బెనెట్‌ అనే సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ రాసిన బుక్‌.   ఫ్రీ మెలనియా-ద అనాథరైజ్డ్‌ బయోగ్రఫీ పేరుతో వచ్చిన ఈ పుస్తకం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మెలనియా, ట్రంప్‌ ఒకే ఇంట్లో ఉంటున్నా..వేర్వేరు అంతస్తుల్లో నిద్రిస్తారట. విదేశీ పర్యటనలకు కూడా ట్రంప్‌ ఒక్కరే వెళ్తారని..కొన్నిసార్లు కలిసివెళ్లినా ఎడమొహం..పెడమొహంగానే ఉంటారట. ఇక ట్రంప్‌ మొదటి బార్య కూతురు ఇవాంకకు, మెలనియాకు మధ్య సన్నిహిత సంబంధాలు లేవట. అధ్యక్షుని భార్యగా దేశ ప్రథమ మహిళ చూసే పనులను ఇవాంక చేస్తుండటం నచ్చక ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతాయట.2018లో మెలనియా ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ అని రాసిన జాకెట్‌ను ధరించడంపై పెద్ద దుమారమే చెలరేగడంతో..అది మీడియాకు సంబంధించింది అని వివరణ ఇచ్చుకోవలసివచ్చింది.

ఇక గతేడాది కిడ్నీప్రాబ్లమ్‌తో అనారోగ్యం పాలైన మెలనియాకు 13 ఏళ్ల కుమారుడు బారెనే లోకమట. అతని బాగోగులతో పాటు వైట్‌హౌస్‌లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒంటరిగా గడుపుతున్నారని పుస్తకంలో వివరించారు కేట్‌ బెనెట్‌. మెలనియా పుట్టినప్పటినుంచి తాజా ఘటనల వరకు ఆమె జీవితంలోని ప్రతి కోణాన్ని288 పేజీల పుస్తకంలో వివరించారామె. ఐతే ఆ బుక్‌ బయటికొచ్చినప్పటినుంచి మెలనియా హౌస్‌ అరెస్ట్‌ అయ్యారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?