Russia – Ukraine: యుద్ధంలో సరికొత్త అధ్యాయం.. షార్క్ డ్రోన్ ఆవిష్కృతం.. ఆ పరిస్థితులే లక్ష్యంగా..

నెలలు గడుస్తున్నా.. రష్యా - ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా రాజుకుంటూనే ఉంది. సైనిక బలం, ఆయుధాలతో రష్యా విరుచుకుపడుతుంటే.. ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ...

Russia - Ukraine: యుద్ధంలో సరికొత్త అధ్యాయం.. షార్క్ డ్రోన్ ఆవిష్కృతం.. ఆ పరిస్థితులే లక్ష్యంగా..
Ukraine Shark Drone
Follow us

|

Updated on: Nov 02, 2022 | 4:53 PM

నెలలు గడుస్తున్నా.. రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా రాజుకుంటూనే ఉంది. సైనిక బలం, ఆయుధాలతో రష్యా విరుచుకుపడుతుంటే.. ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ ఉక్రెయిన్ సరికొత్త డ్రోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రష్యన్ దళాలపై ఫిరంగి కాల్పులు జరిపేందుకు దీనిని రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 24న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఈ డ్రోన్ తయారీ చేపట్టామని తెలిపాయి. ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నప్పటికీ యుద్ధ-వేగ సామర్థ్యాన్ని తగ్గించడానికి డ్రోన్ అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. బ్లాక్ సీ లోని యుద్ధ నౌకల నుంచి రష్యా కాలిబర్ క్షిపణులను చేపట్టింది. ఈ దుర్ఘటనలో అనేక సైనిక, పారిశ్రామిక, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయుధాల కోసం ఉక్రెయిన్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే.. ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం. సోవియట్ కాలంలోని వాటిని సంరక్షించడానికి సమష్టి చర్యలు తీసుకోవడం విశేషం. రష్యన్ సైనిక ఆపరేషన్ ప్రారంభంతో ఉక్రేనియన్ రక్షణ పరిశ్రమ తీవ్ర సమస్యల్లో పడింది.

ఆయుధ సంపత్తిని కాపాడుకోవడం, మెరుగుపరుచుకోవడం కోసం రంగలోకి దిగింది. ఇందులో భాగంగా షార్క్ నిఘా డ్రోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫిరంగి కాల్పులు చేయవచ్చు. ఫార్వర్డ్ అబ్జర్వేషన్ ట్రూప్‌ల అవసరాన్ని తొలగిస్తుంది. అమెరికన్ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ వంటి వ్యవస్థల కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఈ డ్రోన్ ను అభివృద్ధి చేసిన ట్విట్టర్‌లో ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇది టర్కీలో అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఎస్ఏహెచ్ఏ ఎక్స్‌పో గురించి వివరించింది. డ్రోన్ ను అక్కడ ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ లో ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్, రొటేటింగ్ ‘ఫుల్ హెచ్‌డి’ నోస్ కెమెరా/ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్ ఉంటుంది. 60 కిలోమీటర్ల పరిధిలో రెండు గంటల కంటే ఎక్కువ సమయం కాల్పులో జరిపేలా రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ ఉక్రేనియన్ డిఫెన్స్ అండ్ మిలిటరీ పోర్టల్, ఉక్రేనియన్ మిలిటరీ సెంటర్‌ నివేదిక ప్రకారం.. వాలంటీర్ సెర్హి ప్రైతులా యాజమాన్యంలోని ఉక్రేనియన్ స్వచ్ఛంద సంస్థ దీనిని కంపెనీ నుంచి కొనుగోలు చేసింది . యుద్ధ పరిస్థితులలో కొత్త పరికరాలను పరిశీలించిన తర్వాత డ్రోన్‌ల బ్యాచ్‌ను సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రమాదకర కార్యకలాపాలను ప్లాన్ చేసేటప్పుడు, దాడులు చేసేటప్పుడు ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Latest Articles
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే