Ukraine Nuclear Plant: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌.. ఏ క్షణమైనా ఏమైనా జరుగొచ్చు..!

Ukraine Nuclear Plant: ఉక్రెయిన్‌లో జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది.

Ukraine Nuclear Plant: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌.. ఏ క్షణమైనా ఏమైనా జరుగొచ్చు..!
Russia Vs Ukraine
Follow us

|

Updated on: Aug 10, 2022 | 9:59 AM

Ukraine Nuclear Plant: ఉక్రెయిన్‌లో జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ప్రపంచ దేశాలపై ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ అనేక రకాలుగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఒక ఎత్తయితే ఇప్పుడు ఇంకో ఎత్తులా మారింది. ఎందుకంటే దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ రూపంలో ఏ విపత్తు వస్తుందో తెలియడం లేదు. ఇది యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం. తాజాగా బాంబు దాడుల్లో ఈ ప్లాంట్‌ దెబ్బతింది. ఇదే ఆందోళన కలిగించే విషయం. ఈ తప్పెవరిది అంటే.. ఉక్రెయిన్‌, రష్యా పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి.

యుద్ధం మొదలైన తొలి దశలోనే రష్యా దళాలు ప్లాంట్‌ ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే ఇటీవల రష్యా దాడుల్లో ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. అక్కడ మాస్కో సైన్యం కార్యకలాపాలు అణు ప్రమాదానికి దారితీస్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్లాంట్‌ పరిసరాలను సైనిక రహిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతోంది. ఉక్రెయిన్‌ ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ బలగాలే దాడులు చేశాయని చెబుతోంది. దీని వల్ల ఐరోపాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మిత్రదేశాలు ఉక్రెయిన్‌ కళ్లు తెరిపించాలంటోంది.

మరోవైపు, న్యూక్లియర్‌ ప్లాంట్‌పై దాడులు ఆత్మహత్యా సదృశమని హెచ్చరించారు ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు యూఎస్‌ న్యూక్లియర్‌ పరిశీలకులను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఏదైనా తేడా జరిగితే 1986 నాటి చెర్నోబిల్‌ అణు విషాదం పునరావృతం కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెర్నోబిల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోనే జపోరిజ్జియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఉంది.