Chile Sinkhole: ప్రపంచాన్నే వణికిస్తున్న చిలీ సింక్ హోల్.. ఊళ్లకు ఊళ్లనే మింగేలా..

Chile Sinkhole: ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది.. అది అంతకంతకూ విస్తరిస్తోంది..అది కూడఎంతలా అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా..దానికి అసలు కారణమేంటీ..?

Chile Sinkhole: ప్రపంచాన్నే వణికిస్తున్న చిలీ సింక్ హోల్.. ఊళ్లకు ఊళ్లనే మింగేలా..
Sinkhole
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 10, 2022 | 9:48 AM

Chile Sinkhole: ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది.. అది అంతకంతకూ విస్తరిస్తోంది..అది కూడఎంతలా అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా..దానికి అసలు కారణమేంటీ..? చిలీలో వారం క్రితం ఒక్కసారిగా పుట్టుకొచ్చిన సింక్ హోల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆకర్షణగా మారింది. వరల్డ్ బిగ్ మిస్టీరియస్‌గా మారిన ఈ అతి పెద్ద గొయ్యి రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇప్పుడు చూస్తే 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా వున్న స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ఈ భారీ గోతిలో ఈజీగా మునిగిపోతుంది. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఆర్క్‌ డి ట్రయాంఫ్‌ కూడా ఈ గోతిలో ఇమిడిపోతుంది. ఇంత పెద్ద గొయ్యి ఎలా ఏర్పడిందనే అంశంపై పరిశోధిస్తున్నామని చిలీకి చెందిన నేషనల్‌ సర్వీస్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌ విభాగం అధికారులు చెప్పారు.

ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోని అల్కాపరోసా అండర్‌ గ్రౌండ్‌ గనులను కెనడాకు చెందిన కంపెనీ లుండిన్‌ మైనింగ్‌ ఎల్‌యూఎన్‌ నిర్వహిస్తోంది. భారీ గొయ్యి వెలుగు చూసిన నేపథ్యంలో ఆ గనిలో పనుల్ని తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గొయ్యి పడ్డ ప్రాంతంలో వున్న గనిని రెండు దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ మైనింగ్‌లో 80శాతం వాటా కెనడా కంపెనీదేతే.. . మిగిలిన 20శాతం వాటా జపాన్‌కు చెందిన సుమిటోమో మెటల్‌ మైనింగ్‌కు చెందింది. ఇప్పటికే గనిలో నీటిని తోడే యంత్రాలను చేర్చారు. గని ఛాంబర్లు ఎక్కడైనా దెబ్బతిన్నాయేమో పరిశీలిస్తున్నారు. ఈ గొయ్యి వల్ల ఈ ప్రాంతమంతా భవిష్యత్తులో వరదల్లో చిక్కుకోవచ్చని అనుమానిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..