Ukraine PM: భారత ప్రధాని మోడీతో మాట్లాడా.. భద్రతామండలిలో రాజకీయ మద్దతు కోరినట్లు తెలిపిన జెలెన్స్కీ
Ukraine PM: ఉక్రెయిన్‌పై రష్యా (Russia)భారీ దాడికి యత్నిస్తోంది. ఇరు దేశాలు అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం..
Ukraine PM: ఉక్రెయిన్‌పై రష్యా (Russia)భారీ దాడికి యత్నిస్తోంది. ఇరు దేశాలు అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా తీరుపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు దేశాలు ఉక్రెయిన్ (Ukraine)కు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఉక్రెయిన్-రష్యా విషయంలో తటస్థ వైఖరి అవలంభిస్తామని భారత(India) విదేశాంగశాఖ ఇప్పటికే వెల్లడించింది. శాంతియుత మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్లు ప్రకటించారు. తాను భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడగా.. ఆయన రష్యా దూకుడును తిప్పికొట్టే తీరును తెలియజేశారని జెలెన్స్కీ చెప్పారు. తమ భూ భాగంపై రష్యా కు చెందిన ఆక్రమణదారులు 1,00,000 కంటే ఎక్కువ మంది ఉన్నారని ఆయన తెలిపారు. వారు నివాస భవనాలపై కాల్పులు జరుపుతున్నారని ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మరోసారి తెలియజేశారు. అంతేకాదు భారత దేశం భద్రతా మండలిలో ఉక్రెయిన్ దేశానికి రాజకీయ మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఉక్రెయిన్ ప్రధాని తెలిపారు. తమతో కలిసి రష్యా కలిసి దురాక్రమణ ఆపాలని భారత్ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ జెలెన్స్కీని అక్కడ తాజా పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం… అక్కడ పరిస్థితుల గురించి వివరంగా ప్రధాని మోడీకి వివరించారు. యుద్ధం వలన ప్రాణ, ఆస్తి నష్టం జరిగినందుకు ప్రధాని మోడీ తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ హింసను తక్షణమే నిలిపివేయాలని.. ఇరు దేశాలు తిరిగి చర్చలు ద్వారా శాంతి యుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. శాంతి ఏర్పడడానికి ఏ విధమైన సహకారం ఇవ్వడానికైనా భారతదేశం రెడీగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత మరియు భద్రత పట్ల భారతదేశం యొక్క లోతైన ఆందోళనను కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. భారతీయ పౌరులను త్వరితగతిన మరియు సురక్షితంగా తరలించడానికి ఉక్రెయిన్ అధికారులను సులభతరం చేయాలని అతను కోరాడు.
ఇక ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరుపుతోన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పలు దేశాధినేతలు చర్చలు జరుపుతున్నారు.
Spoke with ?? Prime Minister @narendramodi. Informed of the course of ?? repulsing ?? aggression. More than 100,000 invaders are on our land. They insidiously fire on residential buildings. Urged ?? to give us political support in?? Security Council. Stop the aggressor together!
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
Also Read: