Viral News: కన్నతల్లితోనే ఛాలెంజ్ చేశాడు.. ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.. అసలు విషయం తెలిస్తే షాకే..

Viral News: ‘ఇన్‌క్రెడిబుల్’, ‘అద్భుతం’ అంటూ ఓ తల్లి, కొడుకుని సోషల్ మీడియా సమాజం నెత్తిన పెట్టుకుంటోంది. వారిని కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తోంది.

Viral News: కన్నతల్లితోనే ఛాలెంజ్ చేశాడు.. ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.. అసలు విషయం తెలిస్తే షాకే..
Challenge
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2022 | 6:45 PM

Viral News: ‘ఇన్‌క్రెడిబుల్’, ‘అద్భుతం’ అంటూ ఓ తల్లి, కొడుకుని సోషల్ మీడియా సమాజం నెత్తిన పెట్టుకుంటోంది. వారిని కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తోంది. మీరు నిజంగా సూపర్ అంటూ నిరాజనం పలుకుతోంది. అయితే, వీరిని అంతలా ప్రశంసించడానికి ఓ బలమైన కారణమే ఉందండోయ్. ప్రస్తుత కాలంలో ఎవరికీ సాధ్యం కాని పనిని చేసి చూపడంతో.. ఆ తల్లి, కొడుకు లను నెటిజన్లు ఓ రేంజ్‌లో ప్రశంసిస్తున్నారు. ఇంతకీ వారేం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండేవారు చాలా అరుదు. ఎక్కడోచోట, కోటికొక్కరులా స్మార్ట్ లేని వారు ఉంటారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండేవారు ఎంతమంది? అంటే నిర్మొహమాటంగా ఎవరూ లేరని చెబుతారు. ఎందుకంటే.. చంటి పిల్లలు మొదలు పండు మొసలి వారి వారకు అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే ముందు వరకు కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తూనే ఉంటారు. అలాంటిది.. ‘నువ్ సోషల్ మీడియాకు దూరంగా ఉండు’ అంటే ఎవరైనా ఉంటారా? అందులోనూ యువతను సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అంటే ఉంటారా? ఛాన్సే లేదు. కానీ, ఓ యువకుడు ఆ పని చేసి చూపించాడు. రోజులు కాదు.. నెలలు కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి.. తల్లితో తాను చేసిన ఛాలెంజ్‌ను నెగ్గాడు. తల్లి నుంచి 1,800 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అవును మీరు విన్నది నిజంగా నిజమండి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. తల్లి లోర్నా గోల్డ్ స్ట్రాండ్ క్లెఫ్‌సాస్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏంటా సంగతి అంటే.. ‘‘ఆరేళ్ల క్రితం నేను సీవర్ట్‌కి 18 ఏళ్లు వచ్చే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే 1,800 డాలర్ల బహుమతి ఇస్తానని మాట ఇచ్చాను. 1,800 డాలర్లు అంటే అప్పట్లో చాలా ఎక్కువ. ఆ ఛాలెంజ్‌ చేసినప్పుడు సీవర్ట్‌కి 12 ఏళ్లు. నేను చేసిన ఛాలెంజ్‌‌కి సీవర్ట్ కట్టుబడి ఉన్నాడు. రేపు వాడి 18వ పుట్టిన రోజు. ఇప్పుడు అతని జేబులో 1,800 డాలర్ల మనీ, ఇన్‌స్టాగ్రమ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ నూతన అకౌంట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో నేను చేసిన అత్యుత్తమ ఖర్చు ఇది’’ అని పేర్కొంటూ క్లెఫ్‌సాస్ తన కొడుకు సీవర్ట్ ఫోటోను నెటిజన్లతో పంచుకుంది. అంతేకాదు.. సీవర్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ పిక్స్‌ని సైతం ఆమె షేర్ చేసింది.

ఇక ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంపై సీవర్ట్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. కొత్త మొబైల్ ఫోన్‌లో సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఓపెన్ చేసిన సీవర్ట్.. చాలా కొత్తంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నాకు 80 ఏళ్లు వచ్చినట్లు అనిపిస్తోంది. సోషల్ మీడియాను గుర్తించలేకపోతున్నాను. కొత్త కొత్తగా, వింతగా అనిపిస్తోంది. నేను నా స్నేహితులతోనే ఉంటా, వారితోనే సమయం గడుపుతాను. ఈ విధానాన్ని మళ్లీ కంటిన్యూ చేస్తాను.’ సీవర్ట్ పేర్కొన్నాడు.

మొత్తానికి తల్లి ఛాలెంజ్‌ని గెలిచి సూపర్ అనిపించుకున్నాడు సీవర్ట్. కాగా, వీరి ఫోస్టుకు నెటిజన్ల నుంచి అమేజింగ్ రెస్పాండ్స్ వచ్చింది. వారి ఆలోచనా విధానాన్ని ప్రశంసించారు. ఈ ఛాలెంజ్ అద్భుతం అంటూ కొనియాడారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అంటే మామూలు విషయం కాదని, ఇన్నేళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం నమ్మశక్యం కావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also read:

Funny Video: అరెరె ఎంత పని అయిపాయెరా.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌కు వారి మైండ్ బ్లాంక్ అయ్యింది..!

Viral Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. వైరల్ అవుతున్న వీడియో.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..!

Viral Video: భాంగ్రా డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం కురిపించేశారు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే