Funny Video: అరెరె ఎంత పని అయిపాయెరా.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌కు వారి మైండ్ బ్లాంక్ అయ్యింది..!

Viral Video: దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. తాను దోచుకున్న దానికంటే రెట్టింపు విలువైన వస్తువును కోల్పోతే వారి మొహంలో కనిపించే హావభావాలు..

Funny Video: అరెరె ఎంత పని అయిపాయెరా.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌కు వారి మైండ్ బ్లాంక్ అయ్యింది..!
Funny Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2022 | 5:58 PM

Viral Video: దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. తాను దోచుకున్న దానికంటే రెట్టింపు విలువైన వస్తువును కోల్పోతే వారి మొహంలో కనిపించే హావభావాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకుండి. కక్కలేక, మింగలేక అన్నట్లుగా వారి పరిస్థితి ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితినే ఇద్దరు దొంగలు ఫేస్ చేశారు. చిన్న బ్యాగ్ కోసం ప్రయత్నించి.. పెద్ద బైక్‌నే పోగొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. తిక్క కుదిరిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఇద్దరు దొంగలు హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వచ్చారు. జన సంచారం పెద్దగా లేని గల్లీలో కాచుకుని నిల్చున్నారు. ఇంతలో ఓ యువకుడు చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. అయితే, ఆ చేతిలోని ఫోన్‌ను కాజేయాలని దొంగల్లో ఒకడు ప్రయత్నించాడు. కానీ, అంతలోనే ఫోన్ రావడంతో.. ఆ ప్రయత్నం కాస్తా విఫలయత్నం అయ్యింది. కాసేపటి తరువాత హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న మరో యువతి వచ్చింది. చుట్టూ జనాలు కూడా లేరు. ఇదే అదునుగా భావించిన దొంగలు.. ఆ యువతి బ్యాగ్‌ను కాజేసేందుకు ప్రయత్నించారు. తన బ్యాగ్‌ వారికి దక్కకుండా యువతి వారితో పెనుగులాడింది. ఇద్దరు బలంగా ప్రయత్నిస్తుండటంతో ఇక లాభం లేదనుకుని.. తెలివిని ప్రదర్శించింది ఆ యువతి. బ్యాగ్ కోసం దొంగలు ప్రయత్నిస్తుంటే.. ఆ దొంగల తీసుకువచ్చిన స్కూటీపై యువతి కన్నేసింది. ఇంకేముంది సడెన్‌‌గా తన బ్యాగ్‌ను వారికి వదిలేసి.. స్కూటీని ఎక్కి తీసుకెళ్లిపోయింది. యువతి ఇచ్చిన షాక్‌తో ఆ ఇద్దరు దొంగలు లబోదిబోమన్నారు. యువతిని పట్టుకునేందుకు ఆ దొంగలిద్దరూ రోడ్డుపై పడుతూ లేస్తూ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ప్రాంక్ చేసినట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Video Nation (@nation.video)

Also read:

Viral Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. వైరల్ అవుతున్న వీడియో.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..!

Viral Video: భాంగ్రా డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం కురిపించేశారు..!

Wife Caught: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. సడెన్‌గా వచ్చిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే