Russia Ukraine War: యుద్ధంలో పది వేల మందికి పైగా తమ సైనికులు చరిపోయారన్న ఉక్రెయిన్ .. అలా చేస్తే పుతిన్ తో సమావేశానికి రెడీ అంటున్న బైడెన్..

|

Dec 03, 2022 | 6:35 AM

రష్యా, ఉక్రెయిన్ మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న యుద్ధం ఇపట్లో ముగిసేట్లు కనిపించడంలేదు. రెండూ దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో మరింత కాలం ఈ యుద్ధం కొనసాగే సూచనలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్​పై..

Russia Ukraine War: యుద్ధంలో పది వేల మందికి పైగా తమ సైనికులు చరిపోయారన్న ఉక్రెయిన్ .. అలా చేస్తే పుతిన్ తో సమావేశానికి రెడీ అంటున్న బైడెన్..
Russia Ukraine War
Follow us on

రష్యా, ఉక్రెయిన్ మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న యుద్ధం ఇపట్లో ముగిసేట్లు కనిపించడంలేదు. రెండూ దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో మరింత కాలం ఈ యుద్ధం కొనసాగే సూచనలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్​పై దండయాత్ర కోసం రష్యా భారీగా ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్​పై దండయాత్ర కోసం రష్యా ఇప్పటివరకు 82బిలియన్​ డాలర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. గతేడాది రష్యా బడ్జెట్​ రెవెన్యూ 340బిలియన్​ పౌండ్లు. కాగా.. యుద్ధం కోసం రష్యా.. ఇప్పటివరకు తన బడ్జెట్​లో 25 శాతం నిధులను ఉపయోగించింది. మరోవైపు ఈ యుద్ధంలో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. ఉక్రెయిన్‌ వైపు భారీ సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో పొడొల్యాక్‌ వెల్లడించారు. ఇప్పటివరకు పది వేల నుంచి 13వేల మంది వరకు తమ సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం మొదలై దాదాపు తొమ్మిది నెలలు దాటినా ఇరు పక్షాల నుంచి మృతుల సంఖ్యపై కచ్చితమైన వివరాలు వెలువడలేదు. అయితే మైఖైలో ఈ ఏడాది జూన్‌లో మాట్లాడుతూ యుద్ధంలో ప్రతి రోజు 100 నుంచి 200 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌ మృతుల సంఖ్యను పారదర్శకంగా చెబుతుందని పేర్కొంటూ 10 వేల నుంచి 13వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

పౌరుల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. రష్యా వైపు లక్ష మంది మరణించగా.. మరో లక్షన్నర మంది గాయపడి ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు గత నెల అమెరికా సైనిక జనరల్‌ మార్క్‌ మిల్లీ మాత్రం పూర్తిగా భిన్నమైన సంఖ్యను చెప్పిన విషయం తెలిసిందే. అమెరికా సైనిక జనరల్‌ లెక్కల ప్రకారం సుమారు లక్ష మంది రష్యా సైనికులు చనిపోగా.. ఉక్రెయిన్‌ వైపు కూడా లక్ష మంది మరణించడమో.. గాయపడటమో జరిగిందన్నారు. ఐరోపా కమిషన్‌ అధిపతి ఉర్సులా వొన్‌డెర్‌ లెయెన్‌ కూడా లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని వెల్లడించారు. దాదాపు 20,000 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్‌ బేర్‌ గ్రిల్స్ ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని బేర్‌ గ్రిల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వారం తాను ఉక్రెయిన్‌లోని కీవ్‌కు వెళ్లి అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశానన్నారు. ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క మౌలిక వసతులపై దాడులు జరుగుతున్న సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం రోజువారీ పోరాటమేనని తెలిపారు. ప్రపంచం ఇప్పటి వరకు చూడని జెలెన్‌స్కీని ఇప్పుడు చూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖలు చేశారు. యుద్ధం ముగించాలనే ఆలోచన ఉంటే రష్యాతో మాట్లాడేందుకు సిద్ధమని జో బైడెన్ ప్రకటించారు. రష్యా యుద్ధానికి తాము వ్యతిరేకమని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..