కాబూల్ నుంచి ఉక్రెయిన్లను తరలించడానికి ఉద్దేశించిన విమానం హైజాక్ అయిందంటూ వచ్చిన వార్తలను ఇటు ఉక్రెయిన్..అటు ఇరాన్ ఖండించాయి. ఈ హైజాకింగ్ ఘటనకు సంబంధించి మొదట పరస్పర విరుద్ధ వార్తలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమ ప్లేన్ ని ఇరాన్ కు మళ్లించారని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎవ్ గెనీ ఎనిన్ తొలుత ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఏ విమానం రాలేదని ఇరాన్ ఏవియేషన్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. విమాన హైజాకింగ్ వార్తలను ఆయన తోసిపుచ్చారు. కానీ ఆ దేశ విమానమొకటి గతరాత్రి ఇంధనం నింపుకోవడానికి మషాద్ నగరంలో దిగిందని..ఆ తరువాత ఉక్రెయిన్ వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అది ఆ దేశ రాజధాని కీవ్ లో ఉందని కూడా అయన వివరించారు. మొదట తమ విమాన హైజాకింగ్ ఉదంతాన్ని గురించి చెప్పిన ఎవ్ గెనీ…ఆ ప్లేన్ లో ఉక్రేయిన్లు ఎవరూ లేరని, సాయుధులైన కొంతమంది ఆ విమానాన్ని ఇరాన్ తీసుకువెళ్లినట్టు తెలిసిందని చెప్పారు. గత ఆదివారం కూడా తమ విమానాన్ని ఎవరో హైజాక్ చేశారని ఆయన అన్నారు.
నేడు హైజాక్ కి గురైన తమ విమానాన్ని ఎవరో ‘దొంగిలించి ఉంటారని’ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ లోని తమ ప్రజలను తరలించడానికి తాము మూడు సార్లు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయన్నారు. నిజానికి 31 మంది ఉక్రెయిన్లతో బాటు 83 మందితో కూడిన మిలిటరీ ట్రాన్స్ పోర్టు విమానమొకటి ఆఫ్ఘన్ నుంచి ఉక్రెయిన్ చేరుకున్నట్టు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి ఇంకా సుమారు 100 మంది ఉక్రెయిన్లను తరలించవలసి ఉందని ఈ సంస్థ పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికాలో పెళ్లి.. ఇండియాలో విందు! ఆన్‌లైన్ పెళ్లి సందడి!వైరల్ అవుతున్న వీడియో..:NRI Marriage Viral Video.
300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.