UK Police: అప్పుడు అన్యాయంగా ఉరితీశారు.. ఇప్పుడు క్షమాపణలు చెప్పారు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

మహమూద్ మట్టన్ ఒక బ్రిటిష్ సోమాలి, నౌకాదళ ఉద్యోగిగా పనిచేసేవారు. కార్డిఫ్‌లో ఒక దుకాణ యజమాని లిలీ వోల్పర్ట్‌ను హత్య చేశారనే కేసులో.. దోషిగా తేలడంతో 1952లో సెప్టెంబర్‌లో ఆయన్ను ఉరితీశారు.

UK Police: అప్పుడు అన్యాయంగా ఉరితీశారు.. ఇప్పుడు క్షమాపణలు చెప్పారు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Uk Police Apologies
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2022 | 1:14 PM

UK police apogielos: చేయని హత్యకు ఒక వ్యక్తిని దోషిగా తేల్చి ఉరి తీశారు.. ఈ ఘటన 70 ఏళ్ల కిందట జరిగింది.. అయితే.. తాజాగా పోలీసులు తప్పు చేశామంటూ అతని కుటుంబానికి క్షమాపణలు కోరారు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఉరితీసిన 70 ఏళ్ల తర్వాత పోలీసులు.. ఆ వ్యక్తి కుటుంబాన్ని క్షమించమని కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది. మహమూద్ మట్టన్ ఒక బ్రిటిష్ సోమాలి, నౌకాదళ ఉద్యోగిగా పనిచేసేవారు. కార్డిఫ్‌లో ఒక దుకాణ యజమాని లిలీ వోల్పర్ట్‌ను హత్య చేశారనే కేసులో.. దోషిగా తేలడంతో 1952లో సెప్టెంబర్‌లో ఆయన్ను ఉరితీశారు. అయితే.. 1998లో రివ్యూ కమిషన్ ఆయన కేసును ‘కోర్ట్ ఆఫ్ అప్పీల్‌’ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమూద్ మట్టన్ విషయంలో ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా జరిగిందని ఒప్పుకున్న సౌత్ వేల్స్ పోలీసులు.. క్షమాపణలు తెలిపారు. ప్రాసిక్యూషన్ సరిగా జరగకపోవడం వల్ల మహమూద్ మట్టన్ బాధితుడిగా మారాడని.. ఆయనకు అన్యాయం జరిగిందని.. ఇందులో పోలీసుల పాత్ర స్పష్టంగా తెలుస్తుందంటూ చీప్ కాన్‌స్టేబుల్ జెరెమీ వాఘన్ పేర్కొన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ ఘోరమైన తప్పిదం కారణంగా మహమూద్ కుటుంబం చాలా క్షోభ అనుభవించిందని.. దీనికి క్షమాపణ చెప్పడమే సరైన పని అంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సమాజం అంతటా జాత్యహంకారం, పక్షపాతం ప్రబలంగా ఉండేవంటూ వివరించారు. ఈ నిర్మూలన కోసం ఇంకా కృషి చేస్తున్నామన్నారు.

అయితే.. వోల్పెర్ట్ డాక్స్ సమీపంలోని దుకాణంలో గొంతు కోసుకున్నట్లు విచారణ అధికారులు తెలిపారు. మట్టన్ కు భార్య లారా, ముగ్గురు పిల్లలు డేవిడ్, ఒమర్, మెర్విన్ ఉన్నారు. అతని నిర్దోషిత్వ కోసం వారంతా 46 సంవత్సరాలు పోరాడారు.. కానీ వారందరూ మరణించారని అధికారులు తెలిపారు. అయితే.. మట్టన్ కుటుంబానికి సంబంధించి ఆరుగురు మనవళ్లు/మనవరాళ్లు ఉన్నారు. అయితే ఐదుగురు క్షమాపణలు స్వీకరించగా.. ఒకరు మాత్రం దీనిని తోసిపుచ్చారు. మట్టన్ కుటుంబానికి 2001లో హోం ఆఫీస్ నుంచి పరిహారం అందగా.. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..