UK Covid-19: బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ భయాలు..50 వేల మందికి ‘ప్రాణ గండం’..వైద్య నిపుణుల హెచ్చరిక

UK Coronavirus Update: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేయడంతో బ్రిటన్‌ను కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ వస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

UK Covid-19: బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ భయాలు..50 వేల మందికి ‘ప్రాణ గండం’..వైద్య నిపుణుల హెచ్చరిక
UK Covid-19 Update
Follow us

|

Updated on: Apr 13, 2021 | 3:45 PM

బ్రిటన్‌ను కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తే 50 వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. తక్కువలో తక్కువ మరణాల సంఖ్య 30 వేలు వరకు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఈ మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యంకాకపోవచ్చని ఆ దేశ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ జాయింట్ కమిటీ సభ్యుడు ప్రొఫసర్ జే. బ్రౌన్ అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ బ్రిటన్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ దేశ వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయడం సరికాదంటున్నారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశముందని జే.బ్రౌన్ హెచ్చరికలు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై నియంత్రణ కోల్పోతే…నష్టాన్ని తగ్గించడం సాధ్యంకాకపోవచ్చని ప్రొ.జే.బ్రౌన్ వ్యాఖ్యానించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ కారణంగా దేశంలో సంభవించిన ప్రాణనష్టానికి ఏ మాత్రం తక్కువ కాకుండా… థర్డ్ వేవ్‌లోనూ మరణాలు నమోదుకావచ్చని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం ఏ మాత్రం మంచిదికాదన్నారు. కరోనా పట్ల ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా 50 ఏళ్ల వయస్సుకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను బ్రిటన్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసింది. దాదాపు 3.20 కోట్ల మంది జనాభాకు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తికావడం పట్ల ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములైన వారికి అభినందనలు తెలిపారు. ఇక 45 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జులై నెలకల్లా వయోజనులు అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి..సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్