Twins Born: ఒకే రోజు కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కానీ వీరి డేట్ ఆఫ్ బర్త్లు వేరు..
సాధారణంగా కవల పిల్లలు పుడితే ఇద్దరికీ ఒకే రోజు, ఒకే తేది, ఒకే సంవత్సరం ఉంటుంది. కానీ ఇక్కడ కవలలకు తేది, వారం, సంవత్సరం పూర్తిగా వేరు. అదేంటి అనే ఆశ్చర్యం మీలో కలుగవచ్చు. కవలలు అంటున్నారు.. మరి వాళ్ల పుట్టిన వివరాలు ఎలా మారిపోతాయి. సంవత్సరం ఎలా మారిపోతుంది అని అనుమానం కలుగుతుంది. అయితే ఈ స్టోరీ చూసేయాల్సిందే. న్యూ ఇయర్ నాడు కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు ఒక మహిళ.
సాధారణంగా కవల పిల్లలు పుడితే ఇద్దరికీ ఒకే రోజు, ఒకే తేది, ఒకే సంవత్సరం ఉంటుంది. కానీ ఇక్కడ కవలలకు తేది, వారం, సంవత్సరం పూర్తిగా వేరు. అదేంటి అనే ఆశ్చర్యం మీలో కలుగవచ్చు. కవలలు అంటున్నారు.. మరి వాళ్ల పుట్టిన వివరాలు ఎలా మారిపోతాయి. సంవత్సరం ఎలా మారిపోతుంది అని అనుమానం కలుగుతుంది. అయితే ఈ స్టోరీ చూసేయాల్సిందే. న్యూ ఇయర్ నాడు కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు ఒక మహిళ. ఈ కవలలు కేవలం 40 నిమిషాల వ్యవధిలో పుట్టినప్పటికీ వారు పుట్టిన తేదీ, సంవత్సరం, వారం, సమయం పూర్తిగా వేర్వేరు అని ఫాక్స్ న్యూస్ తన కథనంలో నివేదించింది.
న్యూజెర్సీలో నివాసం ఉంటున్న బిల్లీ హంఫ్రీ అతని భార్య ఈవ్ నూతన సంవత్సర వేడుకల్లో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈవ్ హంఫ్రీకి 2023 డిశంబర్ 31 రాత్రి 11:48 గంటలకు ఒక సంతానం కలుగగా.. 2024 జనవరి 1 అర్థరాత్రి 12:28 గంటలకు మరో బాబుకు జన్మనిచ్చారు. పుట్టిన ఇద్దరు పిల్లలతో పాటు తల్లి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా తన భార్య ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం తనకు చాల థ్రిల్లింగ్ గా ఉన్నట్లు పేర్కొన్నాడు భర్త బిల్లీ హంఫ్రీ.
పిల్లలు పెద్ద వాళ్లైన తరువాత ఎక్కడైనా వివరాలు నమోదు చేయించేందుకు వెళ్లినప్పుడు సరికొత్త అనుభూతు ఎదురవుతుంది. కవలలుగా పుట్టారని చెబితే ఒకే రోజు జన్మనిచ్చారని వివరాలు రాసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ల తేది, సమయం, సంవత్సరం వేరుగా ఉంటుంది. ఇక వాళ్ల రూపంలోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా విభిన్న రీతులు ఉన్నాయంటున్నారు తల్లిదండ్రులు. ఎజ్రా అనే బాబు నిద్రపోతున్నప్పుడు, యెహెజ్కేల్ మాత్రం కదులుతూనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కవలలకు 3 ఏళ్లు నిండిన హిజ్కియా అనే అన్నయ్య కూడా ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..