Ancient City: కోళ్లు కనిపెట్టిన చారిత్రాత్మక నగరం.. నేలమాళిగలో బయటపడిన 2000 ఏళ్ల నాటి కట్టడాలు

|

Jun 20, 2023 | 1:23 PM

ఇంటి నేలమాళిగలో వెళ్లిన కోళ్లను వెంబడించి వాటిని బయటకు తీసుకుని రావడానికి ఆ వ్యక్తి వాటిని అనుసరించాడు. ఇంతలో అతని చూపు గోడకు ఉన్న రంధ్రం మీద పడింది. అప్పుడు ఆ రంధ్రం వెనుక ఏమి దాగి ఉందో చూడాలని అతనికి అనిపించింది. దీంతో అతను ఆ  గోడను బద్దలు కొట్టడం ప్రారంభించాడు.. అప్పుడు అతనికి అక్కడ ఒక సొరంగం కనిపించింది.

Ancient City: కోళ్లు కనిపెట్టిన చారిత్రాత్మక నగరం.. నేలమాళిగలో బయటపడిన 2000 ఏళ్ల నాటి కట్టడాలు
Ancient City
Follow us on

ప్రపంచంలో వింతలు, విశేషాలు, రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటిల్లో దాగున్న రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు చరిత్ర కారులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని సార్లు నిర్మాణాల కోసం భూమిని తవ్వుతున్న సమయంలో మన పూర్వీకుల ఆనవాళ్లను తెలియజేస్తూ వస్తువులు, దుస్తులు, నిర్మాణాలు నగరాలు బయల్పడుతు ఉంటాయి. వాటి పని తీరుని చూసి ప్రజలు షాక్ తింటారు.

మన పూర్వీకుల జాడలను తెలిపే చారిత్రాత్మక ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తం అనేకం ఉన్నాయి. ఇవి అలనాటి మన జీవన విధానికి ప్రతి బింబాలుగా నిలుస్తాయి. అలాంటి ఒక ప్రదేశం టర్కీలో కూడా ఉంది. ఈ ప్రదేశం  గురించి ఎవరికీ తెలియదు. అయితే ఒక వ్యక్తి అనుకోకుండా ఆ స్థలాన్ని కనుగొని ప్రపంచం ముందు ఉంచాడు. ఈ ప్రదేశం ఒక చారిత్రాత్మక నగరం. ఇది సుమారు 2 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ చారిత్రక నగరం తన ఇంట్లో దాగి ఉందని..  ఈ విషయం తనకు కూడా ఇంతకు ముందు తెలియదని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

డైలీ స్టార్ యొక్క నివేదిక ప్రకారం…  అతని ఇంట్లో ఉన్న కోళ్లు వేల సంవత్సరాల నాటి ఈ చారిత్రక నగరాన్ని కనుగొనడంలో అతనికి సహాయపడ్డాయి. ఇంటి నేలమాళిగలో వెళ్లిన కోళ్లను వెంబడించి వాటిని బయటకు తీసుకుని రావడానికి ఆ వ్యక్తి వాటిని అనుసరించాడు. ఇంతలో అతని చూపు గోడకు ఉన్న రంధ్రం మీద పడింది. అప్పుడు ఆ రంధ్రం వెనుక ఏమి దాగి ఉందో చూడాలని అతనికి అనిపించింది. దీంతో అతను ఆ  గోడను బద్దలు కొట్టడం ప్రారంభించాడు.. అప్పుడు అతనికి అక్కడ ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో వెళ్లి చూడగా.. అక్కడ ఒక నగరం కనిపించింది. దానిని చూసి ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.

ఇవి కూడా చదవండి

 280 అడుగుల దిగువన ఉన్న చారిత్రక నగరం
నివేదికల ప్రకారం.. ఆ వ్యక్తి ఇంటి నేలమాళిగలో, ఇల్లెంగుబు అనే పురాతన నగరం ఉంది. ఇది భూమి లోపల  280 అడుగుల దిగువన ఉంది. అద్భుతమైన నగరం నిర్మాణ కాలం ఖచ్చితంగా తెలియదు. అయినప్పటికీ, 370 BC నాటి చారిత్రక పత్రాలు ఆధారంగా  ఈ చారిత్రాత్మక ప్రదేశాన్ని డెరింక్యు అనే ప్రజలు ఉపయోగించేవారని తెలుసుకున్నారు.

2000 సంవత్సరాల పురాతనమైన ఈ నగరంలో సుమారు 20 వేల మంది నివసించి ఉంటారని నమ్ముతారు. పాఠశాల నుండి చర్చి వరకు అనేక రకాల బహిరంగ ప్రదేశాలు కూడా ఉన్నాయి.  పూర్వ కాలంలో ప్రజలు ఉపయోగించారు.  విదేశీ దండయాత్రను నివారించడానికి నగరం బంకర్‌గా ఉపయోగించబడే ముందు వస్తువులను నిల్వ చేయడానికి ఈ నగరం నిర్మించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నగరాన్ని భూమి నుండి ఇంత తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారో ఇప్పటివరకు తెలియదు.. ఈ  భూగర్భ నగరం రహస్యంపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..