హవాయ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 11 మంది పరిస్థితి విషమం.. ఫ్లైట్ గాలిలో ఉండగా..

|

Dec 19, 2022 | 1:49 PM

అమెరికాలోని హావాయి ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రఛండమైన గాలుల తాకిడికి అతలాకుతలమైంది.

హవాయ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 11 మంది పరిస్థితి విషమం.. ఫ్లైట్ గాలిలో ఉండగా..
Hawaiian Airlines
Follow us on

అమెరికాలోని హావాయి ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రఛండమైన గాలుల తాకిడికి అతలాకుతలమైంది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఫోనిక్స్ నుంచి హోనలులుకు వెళుతున్న విమానం ఆకాశంలో తీవ్రమైన సుడి గాలుల తాకిడికి ఊగిపోయింది. భీకర గాలులతో విమానంలోని ప్రయాణికులంతా గాయపడ్డారు. ప్రమాద సమయంలో 278 మంది ప్రయాణికులు 10మంది సిబ్బంది ఉన్నారు. విమానం వెళ్తుండగా.. సుడి గాలుల తాకిడికి గతి తప్పి ఊగిపోయింది.

ప్రఛండమైన గాలులు తాకగానే ప్రయాణికులు సీటుబెల్టుపెట్టుకోవడానికి సైతం అవకాశం లేకపోయింది. దీంతో విమానంలో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోతూ సీట్లకు కొట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విలయం నుంచి ఎట్టకేలకు పైలెట్లు విమానంను నియంత్రించి అర్ధగంట తర్వాత హొనలులు విమానాశ్రయంలో ల్యాండ్ చేయగలిగారు. ఈ ఘటనలో మొత్తం 36మంది గాయపడ్డారు. వీరిలో 11మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

విమానం ల్యాండయిన తర్వాత.. తీవ్రమైన పరిస్థితిలో ఉన్న 11 మంది ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వారిలో 14 నెలల చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాలులతో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.