చైనాతో ‘ టారిఫ్ వార్ ‘ కి ట్రంప్ రెడీ !

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ ముదురుతోంది. తమ ఉత్పత్తులపై చైనా పెంచిన సుంకాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. తాజాగా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ తో ఈ నెలలోతాను ఒసాకా (జపాన్) లో భేటీ అయినప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తానన్నారు. , ఆ దేశంమొండికేస్తే తామూ వెనక్కి తగ్గబోమని, చైనా వస్తువులపై అత్యధిక టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. గ్రూప్ ఆఫ్ -20 […]

చైనాతో ' టారిఫ్ వార్ ' కి ట్రంప్ రెడీ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2020 | 4:51 PM

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ ముదురుతోంది. తమ ఉత్పత్తులపై చైనా పెంచిన సుంకాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. తాజాగా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ తో ఈ నెలలోతాను ఒసాకా (జపాన్) లో భేటీ అయినప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తానన్నారు. , ఆ దేశంమొండికేస్తే తామూ వెనక్కి తగ్గబోమని, చైనా వస్తువులపై అత్యధిక టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. గ్రూప్ ఆఫ్ -20 సమ్మిట్ ను పురస్కరించుకుని ట్రంప్, జిన్ పింగ్ త్వరలో అక్కడ భేటీ కానున్నారు. చైనా వస్తువులపై 325 బిలియన్ డాలర్ల మేర సుంకాలు విధించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ఇటీవల ఫ్రాన్స్ లో వెల్లడించిన ట్రంప్ .. జీ-20 శిఖరాగ్ర సమావేశం అనంతరం .. రెండు వారాల్లోనే తన ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ప్రస్తుతం బీజింగ్ వస్తువులమీద మేం 25 శాతం సుంకం విధిస్తున్నాం.. వాళ్ళు (చైనా) దిగిరాకపోతే ఈ శాతాన్ని మరింత పెంచుతాం అని ఆయన అన్నారు. జిన్ పింగ్ ఈ అంశంపై మాట్లాడేందుకు విముఖత చూపిన పక్షంలో ఇక చైనీయులకు మోత మోగడం ఖాయమని, 325 బిలియన్ డాలర్ల మేర సుంకాలను ఎదుర్కోవడానికి వారు రెడీగా ఉండాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిన్ పింగ్ గైర్ హాజరవుతారా అన్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. చైనా నుంచి తమ దేశానికి ధన ప్రవాహం అందుతోందని, అయితే ఆ దేశం తమతో ట్రేడ్ వార్ కి సిధ్ధపడినట్టే కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా-తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై చైనా భారీగా టారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. కన్నారావుపై కేసు నమోదు చేసిన..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..