AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా బైక్ లపై ఇంకా 50 శాతం సుంకమా ..? ట్రంప్ ఫైర్

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్ళపై టారిఫ్ ను ఇండియా 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించినా ఇది ఇంకా ఎక్కువేనని, తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ‘ నా నాయకత్వం కింద గల ఈ దేశాన్ని ఇంకా ఎంతోకాలం మోసం చేయలేరు ‘ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇండియా తమకు మంచి మిత్ర దేశమని, ప్రధాని నరేంద్ర మోదీ అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని ఆయన అన్నారు. […]

మా బైక్ లపై ఇంకా 50 శాతం సుంకమా ..? ట్రంప్  ఫైర్
Anil kumar poka
|

Updated on: Jun 11, 2019 | 1:38 PM

Share

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్ళపై టారిఫ్ ను ఇండియా 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించినా ఇది ఇంకా ఎక్కువేనని, తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ‘ నా నాయకత్వం కింద గల ఈ దేశాన్ని ఇంకా ఎంతోకాలం మోసం చేయలేరు ‘ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇండియా తమకు మంచి మిత్ర దేశమని, ప్రధాని నరేంద్ర మోదీ అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని ఆయన అన్నారు. మా బైక్ ల మీద వంద శాతం సుంకం విధించడం న్యాయమా అని ప్రశ్నించారు. కానీ తాము మాత్రం అలా చేయబోమన్నారు. సీబీఎస్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. తమ దేశపు మోటార్ సైకిల్ అయిన హార్లే డేవిడ్ సన్ వాహనాలపై భారత్ ఇంత సుంకం విధిస్తుందని భావించలేదన్నారు. ఇది ఓ ముఖ్య సమస్యగా మారిందని, దీన్ని జీరో స్థాయికి తగ్గించాలని తాము ఇండియాను కోరుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశం (భారత్) నుంచి దిగుమతి అవుతున్న వాహనాలపై మేం ఇంత టారిఫ్ విధించడంలేదు.. ఆమధ్య ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని స్పష్టం చేశాను అని ఆయన తెలిపారు. మోదీ తనకు ఫోన్ చేసి 50 శాతం టారిఫ్ తగ్గించినట్టు చెప్పారని, కానీ దీన్ని కూడా తాము అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఈ విషయమై భారత ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉభయదేశాలు చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇతర దేశాలతో తాము 800 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో కొనసాగుతున్నామని, అందువల్ల ఈ అంశాన్ని కూడా భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని సుంకాల విషయంలో పునరాలోచించాలని అన్నారు. కాగా-ఇండియాకు ఇఛ్చిన అత్యంత వాణిజ్య ప్రాధాన్యతా స్థాయికి స్వస్తి చెప్పాలన్న అమెరికా యోచనను భారత్ ఖండిస్తోంది. దీనికి ప్రతీకార చర్యగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ ను ఇంకా పెంచాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. అంటే యాపిల్స్, బోరిక్ యాసిడ్, ఆల్మండ్స్ వంటివాటిపై సుంకాలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16 నాటికి, లేదా ఈ మాసాంతానికి దీనిపై ఈ శాఖ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మొదట ఈ అంశంపై విదేశాంగ శాఖతో అధికారులు సంప్రదింపులు జరుపుతారు. ఈ మొత్తం వ్యవహారంపై కొత్తగా వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేబట్టిన పీయూష్ గోయెల్ వరుసగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు.ఇండియాకు ఇస్తున్న అత్యంత వాణిజ్య ప్రాధాన్యతా స్థాయిని ఉపసంహరించాలని ట్రంప్ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రభావం ప్రధానంగా మన ఇమిటేషన్ జ్యూవెలరీ, పాదరక్షలు మినహా లెదర్ వస్తువులు, ప్లాస్టిక్, వ్యవసాయోత్పత్తులు, ఫార్మాసిటికల్స్, కెమికల్స్, సర్జికల్ పరికరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ , ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.