5 జీ టెక్నాలజీతో సర్జరీ.. చైనాదే ఈ ఘనత !

ఇప్పటివరకు మనం సెల్యులార్ టెక్నాలజీలో 4 జీ టెక్నాలజీ గురించే విన్నాం.. ఎల్ ఈ టీ నెట్ వర్క్ లో ఈ టెక్నాలజీ వినియోగం మనకు అలవాటవుతోంది. అయితే దీనికన్నా 10 నుంచి 100 రెట్లు అత్యంత వేగం గల డౌన్ లోడ్ స్పీడ్ తో ‘ వచ్ఛేతరం ‘ 5 జీ సెల్యులార్ టెక్నాలజీకి భవిష్యత్తు మార్గం సుగమం చేస్తోంది. చైనా డాక్టర్లు ఈ విషయంలో అప్పుడే ముందడుగు వేశారు. ఈ నెట్ వర్క్ ను […]

5 జీ టెక్నాలజీతో సర్జరీ.. చైనాదే ఈ ఘనత !
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 12, 2019 | 5:05 PM

ఇప్పటివరకు మనం సెల్యులార్ టెక్నాలజీలో 4 జీ టెక్నాలజీ గురించే విన్నాం.. ఎల్ ఈ టీ నెట్ వర్క్ లో ఈ టెక్నాలజీ వినియోగం మనకు అలవాటవుతోంది. అయితే దీనికన్నా 10 నుంచి 100 రెట్లు అత్యంత వేగం గల డౌన్ లోడ్ స్పీడ్ తో ‘ వచ్ఛేతరం ‘ 5 జీ సెల్యులార్ టెక్నాలజీకి భవిష్యత్తు మార్గం సుగమం చేస్తోంది. చైనా డాక్టర్లు ఈ విషయంలో అప్పుడే ముందడుగు వేశారు. ఈ నెట్ వర్క్ ను ఉపయోగించి ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఓ రోగికి గాల్ బ్లాడర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 200 కి. మీ. దూరం నుంచి ఓ ఆస్పత్రిలో ఇదే టెక్నాలజీని వినియోగిస్తూ.. ఆ ప్రాంతంలోని వైద్యులకు సూచనలు చేస్తూ ఈ ఆపరేషన్ చేయడం వారికే చెల్లింది. (ఈ సర్జరీనే ‘ లాప్రోస్కోపిక్ ఖోలిసిస్టెక్టోమీ అని కూడా వ్యవహరిస్తారు). ఉత్తర చైనా హుబీ ప్రావిన్స్ లోని గ్రామంలో ఒక రోగికి సుమారు గంటపాటు ఈ సర్జరీ జరిగింది. చైనాలోని నాలుగు టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ‘ చైనా మొబైల్ ‘ 5 జీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఈ నెల 6 న లైసెన్సు పొందింది. ఈ టెక్నాలజీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడంతో మొత్తం సర్జరీ ప్రక్రియ సులభతరమైంది. షియాన్ సిటీలోని తైహే ఆసుపత్రిలో గల నిపుణుల బృందానికి లైవ్ ఫీడ్ ద్వారా మొదట దీన్ని ట్రాన్స్ మిట్ చేశారు. ఈ నెట్ వర్క్ ఆలస్యం కాలేదని, ఆపరేషన్ అనంతరం పేషంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సర్జికల్ బృందం తెలిపినట్టు సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. ట్రాన్స్ మిట్ అయిన వీడియోలు, ఫోటోల క్లారిటీకి 5 జీ టెక్నాలజీ గ్యారంటీ ఇస్తోందని, ఈ నెట్ వర్క్ ద్వారా డాక్టర్లు ఎంత దూరంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా ఇతర డాక్టర్లకు సహకరిస్తూ సర్జరీలు నిర్వహించవచ్చునని ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. రవాణా, ఎంటర్ టైన్మెంట్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో చైనా ఈ నెట్ వర్క్ ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు హుబీ ప్రావిన్స్ లో 300 కు పైగా 5 జీ బేస్డ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీ సిగ్నల్ కవరేజీ చాలా బాగుందని, రాజధాని బీజింగ్ లో 4,300  5 జీ బేస్డ్ కేంద్రాలు ఉన్న దృష్ట్యా ఈ విధమైన నెట్ వర్క్ ఈ రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వారు చెబుతున్నారు. సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ కోసం తహతహలాడుతున్న చైనా ప్రభుత్వం టెలికాం సంస్థలకు 5 జీ లైసెన్సులు జారీ చేయడం ప్రారంభించింది.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు