AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుల్లో ట్రంప్‌..పరువు పోయినా పదవి నిలిచేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన గండం నుంచి బయటపడతారా..? లేక అభిశంసనకు గురవుతారా..? అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్‌ దిగిపోవాల్సి వస్తుందా..? ఏం జరగబోతోంది..? గతంలో అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షులు ఎవరు..? వారు అభిశంసనకు గురయ్యారా..లేక గట్టెక్కారా..? అప్పుడేం జరిగింది..? ఇప్పుడేం జరగబోతోంది..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి యూఎస్‌ దిగువ సభ ఆమోదం తెలిపింది. అధికార దుర్వినియోగం, విచారణకు సహకరించలేదన్న రెండు అభియోగాలపై ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ […]

చిక్కుల్లో ట్రంప్‌..పరువు పోయినా పదవి నిలిచేనా..?
Pardhasaradhi Peri
|

Updated on: Dec 20, 2019 | 4:33 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన గండం నుంచి బయటపడతారా..? లేక అభిశంసనకు గురవుతారా..? అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్‌ దిగిపోవాల్సి వస్తుందా..? ఏం జరగబోతోంది..? గతంలో అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షులు ఎవరు..? వారు అభిశంసనకు గురయ్యారా..లేక గట్టెక్కారా..? అప్పుడేం జరిగింది..? ఇప్పుడేం జరగబోతోంది..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి యూఎస్‌ దిగువ సభ ఆమోదం తెలిపింది. అధికార దుర్వినియోగం, విచారణకు సహకరించలేదన్న రెండు అభియోగాలపై ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. ట్రంప్‌ అభిశంసనకు మద్దతుగా డెమోక్రాట్స్‌..వ్యతిరేకంగా రిపబ్లికన్లు ఓటేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న అభియోగానికి అనుకూలంగా 230 ఓట్లు..వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్నఅభియోగంపై అనుకూలంగా 229మంది..వ్యతిరేకంగా 197మంది ఓటేశారు. దీంతో దిగువ సభలో అభిశంసనకు గురైన మూడవ అధ్యక్షునిగా నిలిచారు ట్రంప్‌. దీంతో సీన్‌ సెనేట్‌కు మారింది. వచ్చేజనవరి రెండో వారంలో సెనేట్‌లో అభిశంసనపై చర్చ, ఓటింగ్‌ ఉంటుంది.

సెనేట్‌లో వంద మంది సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఓటేస్తేనే పదవి కోల్పోవలసి వస్తుంది. కానీ సెనేట్‌లో ఆ పరిస్థితి లేదు. సెనేట్‌లో ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్లదే ఆధిపత్యం. మెజార్టీ రిపబ్లికన్లు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారే. ప్రజల్లో ట్రంప్ గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ…హౌజ్‌లో మాత్రం ఆయనకు కావాల్సినంత మద్దతు ఉంది. అందుకే ట్రంప్ అభిశంసన తీర్మానంలో సులభంగా గట్టెక్కుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షులు ట్రంప్‌తో కలిపి ముగ్గురు. తొలిసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌. 1868లో సెనేట్‌ అనుమతి లేకుండా ఓ ఉన్నతోద్యోగిని తొలిగించడంతో..టెన్యూర్‌ ఆఫ్‌ ఆఫీస్‌ యాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించారని..ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు..వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో అభిశంసన ప్రవేశపెట్టగా 35 ఓట్లు అనుకూలంగా 19 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారు. ఈ లెక్కన ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు.

ఇక 1999లో బిల్‌క్లింటన్‌ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. వైట్‌హౌస్‌ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లెవెన్‌స్కీతో అక్రమ సంబంధం ఉందని సాక్ష్యాలతో సహా రుజువవడంతో ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. ఐతే సెనేట్‌లో డెమోక్రాట్ల బలముండటంతో అభిశంసన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వీరే కాదు 1974లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నిక్సన్‌ కూడా అభిశంసన విచారణ ఎదుర్కొన్నారు. ఐతే ఓటింగ్‌కు ముందే తన పదవికి రాజీనామా చేశారు నిక్సన్‌.

ఇక ఇప్పుడు ట్రంప్‌ వంతొచ్చింది. డెమోక్రాట్స్‌ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జోబిడెన్‌ కుటుంబంపై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలతో అభిశంసన ఎదుర్కొన్నారు డొనాల్డ్‌. ఐతే ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన జాన్సన్‌, క్లింటన్‌ సెనేట్‌లో మాత్రం గట్టెక్కారు. ట్రంప్‌ విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సెనేట్‌లో కూడా ఆయన అభిశంసనకు గురైతే పదవి కోల్పోయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా అపకీర్తి మూటగట్టుకోనున్నారు.