Donald Trump: ఆ నేరాల్లో ట్రంప్ దోషిగా తేలితే 136 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..న్యాయ నిపుణులు కీలక వ్యాఖ్యలు

|

Apr 05, 2023 | 3:45 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో లోంగిపోయి ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ట్రంప్ పై 34 నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే.

Donald Trump: ఆ నేరాల్లో ట్రంప్ దోషిగా తేలితే 136 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..న్యాయ నిపుణులు కీలక వ్యాఖ్యలు
Donald Trump
Follow us on

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో లోంగిపోయి ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ట్రంప్ పై 34 నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ కేసుల్లో ట్రంప్ ను దోషిగా తేల్చితే..అప్పుడు ఆయనకు 136 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ఒకవేళ ట్రంప్ దోషిగా తేలినప్పటికీ అంత శిక్ష పడకపోవచ్చని.. శిక్ష తగ్గించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. అశ్లీల నటీ స్టార్మీ డేనియల్స్ కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించిన అంశంలో.. ఆ నేరాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ట్రంప్ తన బిజినెస్ రికార్టులు మార్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల చట్టాలను కూడా మార్చే ఆలోచన చేసినట్లు న్యాయవాది ఆరోపించారు.అలాగే హష్ మనీ వివరాలు బయటపడకుండా చేసేందుకు ట్రంప్ 34 తప్పుడు ఎంట్రీలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

కోర్టులో హాజరైన అనంతరం ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునే వారి నుంచి ధైర్యంగా రక్షించుకోవడమే తాను చేసిన తప్పని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశం క్షీణ దశలో ఉందని ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుతున్నాయని ఆరోపించారు. ఆఫ్గానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ, వలసల విషయంలో మన నిర్ణయాలు నవ్వులపాలయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న అతివాద వామపక్షాలు తనను అణచివేయాలని చూస్తున్నారనన్నారు. వారు ఎన్నికల్లో జోక్యం చేసుకోలవాలనుకుంటున్నారని..వారిని మేం అడ్డుకుంటామని తెలిపారు. అమెరికాను మళ్లీ ఉన్నంతగా మారుస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం