AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: వైట్ హౌస్ లో దీపావళిని జరుపుకున్న ట్రంప్.. ప్రధాని మోదీతో వాణిజ్య ఒప్పందం గురించి చర్చించానని వెల్లడి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను ఈరోజు ప్రధాని మోడీతో మాట్లాడాను. మేము వాణిజ్యం గురించి చర్చించాము. ఆయన వాణిజ్య చర్చల్లో చాలా ఆసక్తిగా పాల్గొన్నారు అని అన్నారు.

Diwali 2025: వైట్ హౌస్ లో దీపావళిని జరుపుకున్న ట్రంప్.. ప్రధాని మోదీతో వాణిజ్య ఒప్పందం గురించి చర్చించానని వెల్లడి..
Diwali At White HouseImage Credit source: Reuters
Surya Kala
|

Updated on: Oct 22, 2025 | 7:03 AM

Share

భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన చర్చలలో ప్రధానంగా వాణిజ్య అంశాలపై చర్చించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెలిపారు. ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ “మేము అనేక సమస్యల గురించి మాట్లాడాము.. అయితే ఎక్కువగా వాణిజ్యం గురించి మాట్లాడాము” అని అన్నారు. భవిష్యత్తులో భారతదేశం రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయదని ఆయన పునరుద్ఘాటించారు.

వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీతో తన సంభాషణ గురించి మళ్ళీ అనేక విషయాలను వెల్లడించారు. “భారత ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మీ ప్రధాన మంత్రి (నరేంద్ర మోడీ)తో మాట్లాడాను. మేము చాలా మంచి సేపు వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాము” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్, భారత్ తో యుద్ధం జరగదు  సంభాషణలో ప్రాంతీయ శాంతి గురించి క్లుప్తంగా చర్చించామని అమెరికా అధ్యక్షుడు అన్నారు. భారతదేశం , పాకిస్తాన్ రెండూ ఘర్షణను నివారించాలని తాను గతంలో కోరానని ట్రంప్ అన్నారు. “పాకిస్తాన్‌తో యుద్ధం ఉండకూడదని మేము కొంతకాలం క్రితం చెప్పమని” అని ఆయన అన్నారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధం లేదని..ఇది చాలా చాలా మంచి విషయం అని ఆయన అన్నారు.

ప్రధాని మోదీతో తనకున్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన. ఆయనను గొప్ప వ్యక్తి, స్నేహితుడు అని ప్రశంసించారు. అయితే ట్రంప్ తాజా వాదనలను భారతదేశం ధృవీకరించలేదు.

రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయనుంది. వారం క్రితం అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాంటి వాదనలే చేస్తూ, తాను ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడానని, న్యూఢిల్లీ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తుందని మోడీ హామీ ఇచ్చారని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మాస్కోను ఒంటరిని చేసే ప్రయత్నాలలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఆయన అభివర్ణించారు. అయితే భారతదేశం ఈ ప్రకటనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

భారతదేశంతో తన వాణిజ్య విధానాన్ని సమర్థించుకుంది. వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతదేశం రష్యా చమురు కొనుగోళ్లను నిరంతరం కొనసాగిస్తున్నందుకు ప్రతిస్పందనగా ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించారు. ఈ సంవత్సరం ఆ దేశం నుంచి దిగుమతులపై మొత్తం సుంకం రేటు దాదాపు 50 శాతానికి చేరుకుంది.

అంతకుముందు ట్రంప్ తన సుంకాల పెంపుదలను సమర్ధించుకున్నారు. అవి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సంభావ్య యుద్ధాలను కూడా నిరోధించాయని పేర్కొన్నారు. “నేను ఎనిమిది యుద్ధాల గురించి ప్రస్తావించాను. ఆ ఎనిమిది యుద్ధాలలో ఐదు పూర్తిగా వాణిజ్యం, సుంకాలపై ఆధారపడి ఉన్నాయి” అని ఆయన అన్నారు.

భారతదేశం , పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేసిన వాదనలను భారతదేశం నిరంతరం తిరస్కరించింది. మూడవ పక్ష జోక్యం లేకుండా రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) ప్రత్యక్ష సంభాషణ ద్వారా కాల్పుల విరమణకు అంగీకరించారని భారత అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..