అలా ఎలా కొట్టేశార్రా.. మోనాలిసా మ్యూజియంలో 7 నిమిషాల్లోనే కోట్ల దోపిడీ..
ఆడు మగాడ్రా బుజ్జీ అనే డైలాగ్‌కు సరిగ్గా సరిపోయేలా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిస్ లువ్రే మ్యూజియంలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది.. కేవలం 7 నిమిషాల్లో నలుగురు దొంగలు ఎటువంటి హింస లేకుండా, అందరూ చూస్తుండగానే లిఫ్ట్ ల్యాడర్‌పై ఎక్కి కిటికీ పగులగొట్టి, కోట్ల విలువైన 9 పురాతన వస్తువులను దోచుకెళ్లారు.

ఎవడైనా కోపంగా కొడతాడు, కసిగా కొడతాడు, వీడేంట్రా చాలా సరదాగా గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జీ. అన్నడైలాగ్ యాదుందిగా. ఈ డైలాగ్ ఫ్రాన్స్ లువ్రె మ్యూజియంలో జరిగిన దోపిడికీ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే..అక్కడేం బీభత్సం జరగలేదు. అందరూ చూస్తుండగానే మ్యూజియంపైకి ఎక్కారు, విండో బ్రేక్ చేశారు. కోట్ల విలువైన సంపద దోచుకెళ్లారు.. నలుగురు దొంగలు, 7నిమిషాలు. బొట్టు రక్తం చిందలేదు. ఒక్క బుల్లెట్ ఖర్చుకాలేదు. లో బడ్జెట్‌లో హై రేంజ్ హైస్ట్.
పారిస్ లువ్రే మ్యూజియం అని చెబితే మెజార్టీ పీపుల్స్‌కు అంత త్వరగా కనెక్ట్‌కాకపోవచ్చు. కానీ మొనాలిసా ఉన్న మ్యూజియం అంటే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఎస్ మోనాలిసా ఉన్న లవ్రే మ్యూజియంలోనే భారీ దోపిడీ జరిగింది. అది పట్టపగలు, వందలమంది సందర్శకులు ఉన్న టైమ్‌లోనే జరిగింది. మ్యూజియం ముందు భాగంలో అతిపెద్ద పిరమిడ్ ఆకారంలో చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ శతాబ్ధాల కాలం నాటి అభరణాలు, వస్తువులు ఉంటాయి. ఫ్రెంచ్ వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక సంపద ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇక్కడే దొంగతనం జరిగింది.
అత్యంత పురాతనమైన, విలువైన ఆభరణాలు, కిరీటం, పచ్చల హారాలు వంటి 9 వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. నలుగురు మనుషులు నాలుగు దశల్లో దోపిడీకి స్కెచ్ వేశారు. ఫస్ట్ ఫ్రాన్స్ టైమ్ ప్రకారం ఉదయం 9గంటలకు నలుగురు ముసుగు దొంగలు లువ్రే మ్యూజియం దక్షిణభాగంలోకి వచ్చారు. ఒకడు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్న లిఫ్ట్ ల్యాండర్‌ను పార్క్ చేసి ఉంచాడు. మరో ముగ్గురు బైక్‌ల్లో వచ్చారు. ఇక్కడ అంతకుముందే పార్క్ చేసి ఉన్న లిఫ్ట్ ల్యాడర్ ద్వారా ముగ్గురు దొంగలు అపోలో గ్యాలరీ విండో దగ్గరకు వెళ్లారు. కట్టర్ ద్వారా విండో గ్లాస్‌ను తొలగించి ఇద్దరు లోపలకి వెళ్లారు. బయట ఒకడు కాపలాగా ఉన్నాడు.
లోపలికెళ్లిన ఇద్దరు దొంగలు అక్కడున్న గార్డ్స్‌ను బెదరించి అభరణాలున్న క్యాబిన్‌ను పగులగొట్టి 9 వస్తువులను చోరీ చేసి వెంటనే బయటకు వచ్చారు. 9 గంటలా 7నిమిషాలకు పార్క్ చేసి ఉన్న బైకుల్లో నలుగురు దొంగలు పారిపోయారు. అంటే 7నిమిషాల్లో పని ముగించుకుని దొంగలు పరారయ్యారు. 9వస్తువుల్లో అత్యంత ఖరీదైన కిరీటం మాత్రం మ్యూజియం పరిసరాల్లోనే దొరికింది. ఇంకా 8 వస్తువులు రికవరీ కావాల్సి ఉంది. చోరీ చేసిన వస్తువుల వివరాలు చూస్తే…మైండ్ బ్లాంక్ అవుతుంది. అంత విలువైన వస్తువులవి.
