Viral: షాపింగ్ నుంచి ఇంటికొచ్చిన సవతి తల్లి.. వార్డ్‌రోబ్ ఓపెన్ చేయగానే.. వామ్మో.!
సవతి తల్లి షాపింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి కూసింత భయపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఇదిగో..! ఈ స్టోరీ పై ఓ లుక్కేయండి మరి. లేట్ ఎందుకు వివరాలు ఇలా ఉన్నాయి..

ఓ11 ఏళ్ల బాలిక మృతదేహం ఆమె వార్డ్‌రోబ్‌లో వేలాడుతూ కనిపించింది. ఈ దారుణమైన ఘటన దక్షిణ కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మరణించిన అమ్మాయి ఆర్జీ కర్ అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన సంజయ్ రాయ్ మేనకోడలు. మరణించిన బాలిక సవతి తల్లి షాపింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నిశ్శబ్దాన్ని చూసి కొంచెం కంగారుపడింది. తన కూతురు గదిలోకి వెళ్లి.. ఆమె లేదని గమనించి.. వార్డ్‌రోబ్ తెరిచి చూడగా.. అందులో కూతురు మృతదేహం వేలాడుతూ కనిపించింది. అయితే అలీపోర్ పోలీసులు ఈ ఘటన అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేశారు. మంగళవారం బాలిక తండ్రి, సవతి తల్లిని అరెస్ట్ చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే, స్థానికులు చనిపోయిన బాలిక తండ్రి, సవతి తల్లిని కొడుతూ కనిపించారు. తల్లిదండ్రులే బాలికను చంపారని ఆరోపించారు. తల్లిదండ్రులు బాలికను చాలా హింసించేవారు, అందుకే ఆ బాలిక ఎప్పుడూ ప్రతిదానికీ భయపడేది అని వారు వెల్లడించారు. అంతేకాదు ఏడేళ్ల క్రితం మరణించిన బాలిక అసలు తల్లి కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉందని స్థానికులు చెప్పుకొచ్చారు. మరణించిన బాలిక అసలు తల్లి ఆర్జీ కర్ అత్యాచారం, హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ అక్క అని, చనిపోయిన బాలిక సవతి తల్లి రాయ్ చెల్లెలు అని తెలుస్తోంది. కాగా, పోలీసులు పోస్టుమార్టంకు సంబంధించిన విషయాలను వెల్లడించలేదు.
