16 ఏళ్ల తర్వాత మ్యూజియంలో భద్రపరిచిన తన హృదయాన్ని చూసేందుకు వచ్చిన మహిళ!..

|

May 20, 2023 | 12:51 PM

గుండె మార్పిడికి ముందు జెన్నిఫర్ ఎంత అనారోగ్యానికి గురైందో వివరించారు. ఇప్పుడు 38 ఏళ్ల వయస్సులో ఉన్న జెన్నిఫర్ జీవితం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. ఆమె వివాహ కూడా చేసుకుంది. గుండె మార్పిడి తర్వాత ఆమె తన కొత్త జీవితాన్ని పూర్తిస్థాయిలో సంతోషంగా అనుభవిస్తుందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

16 ఏళ్ల తర్వాత మ్యూజియంలో భద్రపరిచిన తన హృదయాన్ని చూసేందుకు వచ్చిన మహిళ!..
Heart Transplant
Follow us on

మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన తన హృదయాన్ని చూసేందుకు 16ఏళ్ల తర్వాత వచ్చింది ఓ మహిళ. ఈ విచిత్ర సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ అయిన జెన్నిఫర్ సుట్టన్ 16 ఏళ్ల తర్వాత లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో తన హృదయాన్ని ప్రదర్శించిన అసాధారణ అనుభవాన్ని పొందారు. 22 సంవత్సరాల వయస్సులో నిర్బంధ కార్డియోమయోపతితో బాధపడుతున్న జెన్నిఫర్ 2007లో గుండె మార్పిడి చేయించుకుంది. ట్రాన్స్‌ప్లాంట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండగా, జెన్నిఫర్ ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో ఆమెకు తగిన దాత దొరకటంతో తనకు హార్ట్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. దాంతో జెన్నిఫర్ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే, పాడైపోయిన జెన్నిఫర్‌ హృదయాన్ని అప్పటి నుండి Hunterian Museumలోనే ప్రదర్శనకు ఉంచారు. కాగా, ఇప్పుడు 16 సంవత్సరాల తరువాత ఆమె తన హృదయాన్ని ప్రదర్శనలో చూసేందుకు వచ్చినపుడు తనకు కలిగిన అనుభవాన్ని షేర్‌ చేసింది.

అధివాస్తవిక అనుభవం అంటూ జెన్నిఫర్ తన అనారోగ్యానికి కారణమైన గుండెను చూసి ఆశ్చర్యపోయింది. ఇలా తన గుండెను ప్రదర్శనకు ఉంచడం, దానిని తాను స్వయంగా చూసుకోవటం తనకు దక్కిన గొప్ప బహుమతిగా భావిస్తున్నట్టుగా చెప్పింది. జెన్నిఫర్ తన కథ ఇతరులకు అవయవ దానం గురించి ఆలోచించేలా ప్రేరేపిస్తుందని, మరింత మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పింది. ప్రదర్శనలో తన హృదయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన తర్వాత, అవయవ దానం ప్రాముఖ్యతను గుర్తుచేసే విధంగా చాలా మంది ఈ ప్రదర్శనను చూస్తారని జెన్నిఫర్ భావిస్తోంది.

జెన్నిఫర్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు మాట్లాడుతూ… ఆమె కోలుకోవడాన్ని ప్రశంసించారు. గుండె మార్పిడికి ముందు జెన్నిఫర్ ఎంత అనారోగ్యానికి గురైందో వివరించారు. ఇప్పుడు 38 ఏళ్ల వయస్సులో ఉన్న జెన్నిఫర్ జీవితం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. ఆమె వివాహ కూడా చేసుకుంది. ఆమె తన కొత్త హృదయాన్ని ఆరోగ్యంగా చూసుకోవటం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గుండె మార్పిడి తర్వాత ఆమె తన కొత్త జీవితాన్ని పూర్తిస్థాయిలో సంతోషంగా అనుభవిస్తుందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

జెన్నిఫర్ కథ చాలా మంది వ్యక్తులను, వారి జీవితాలను ప్రభావితం చేసే అవయవ దానం ఎంత విలువైనదో చెప్పేందుకు నిదర్శనం. ఇలాంటి ప్రదర్శన ద్వారా మరింత మంది వ్యక్తులను అవయవ దాతలుగా మార్చాలని, ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని భావిస్తోంది. మన దేశంలో  కూడా రోజూ రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారు. బ్రెయిన్ డెడ్ అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇతర కారణాలతో చనిపోతున్నవారూ.. ఇలా చాలామంది ఉంటున్నారు. వారు ఎలాగూ తిరిగి బతికే అవకాశాలు లేవు.. కాబట్టి.. వారి అవయవాల్ని ఇతరులకు దానం చేయడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకంటే గొప్పదానం ఏముంటుందని ప్రజలకు అన్ని విధాలా అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..