AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TikTok: టిక్ టాక్‌కు ట్రంప్ బిగ్ షాక్.. తమ డీల్‌కు ఒప్పుకోకపోతే బ్యాన్ విధిస్తామని వార్నింగ్..

టిక్ టాక్‌కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. తాము చెప్పినట్లు చేయకపోతే బ్యాన్ చేస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. కానీ అమెరికా చెప్పినట్లు చేయాలంటే టిక్ టాక్‌కు చైనా అనుమతి తప్పనిసరి. మరి అమెరికా కండీషన్‌కు చైనా ఓకే అంటుందా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

TikTok: టిక్ టాక్‌కు ట్రంప్ బిగ్ షాక్.. తమ డీల్‌కు ఒప్పుకోకపోతే బ్యాన్ విధిస్తామని వార్నింగ్..
Tiktok Us
Krishna S
|

Updated on: Jul 25, 2025 | 10:06 PM

Share

టిక్ టాక్.. అప్పట్లో మన దేశంలో ఒక ఊపు ఊపింది. చాలా మంది దీన్ని వాడి ఫేమస్ అయ్యారు. మరికొంత మంది సినిమా అవకాశాలను సైతం దక్కించుకున్నారు. ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని ఈ యాప్ సేకరిస్తుందంటూ కేంద్రం దీన్ని నిషేధించింది. అయితే ఇతర దేశాల్లో మాత్రం ఇది పనిచేస్తుంది. అమెరికాలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు చైనా చేతుల్లోనే ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ యొక్క యుఎస్ షేర్లను విక్రయించాలనే యుఎస్ ప్రతిపాదనను చైనా అంగీకరించకపోతే.. గతంలో మాదిరి టిక్‌టాక్‌ను మళ్ళీ యుఎస్‌లో నిషేధించనున్నట్లు లుట్నిక్ తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సెప్టెంబర్ 17 వరకు టిక్‌టాక్‌కు గడువు ఇచ్చింది.

చైనా ఆమోదం చాలా కీలకం..

టిక్‌టాక్ తన యుఎస్ షేర్లను విక్రయించడానికి చైనా అధికారుల ఆమోదం తప్పనిసరి అని లుట్నిక్ నొక్కిచెప్పారు. చైనా దీనికి అంగీకరించకపోతే టిక్‌టాక్ యుఎస్‌లో అందుబాటులో ఉండదు. అయితే దీనిపై అధికారికంగా చైనాతో చర్చించలేదని లుట్నిక్ వెల్లడించారు.

జాతీయ భద్రతా ముప్పు

కొంతమంది యుఎస్ అధికారులు టిక్‌టాక్‌ను జాతీయ భద్రతా ముప్పుగా చూస్తున్నారు. టిక్‌టాక్ బీజింగ్‌కు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉంది. టిక్‌టాక్ ద్వారా సేకరించిన యుఎస్ వినియోగదారుల డేటాను కంపెనీ చైనాతో పంచుకుంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. టిక్‌టాక్ ఈ ఆరోపణలను ఖండించింది.

అమెరికా ప్రతిపాదనలు

బైట్‌డాన్స్.. టిక్‌టాక్, దాని అమెరికా ఆస్తులను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. దానిని అమెరికన్ పెట్టుబడిదారుల బృందానికి అమ్మడం వల్ల.. టిక్‌టాక్ యొక్క అమెరికా డేటాపై తమ నియంత్రణ ఉంటుందనేది అగ్రరాజ్యం వాదన. చైనా అమ్మకానికి అంగీకరించకపోతే, ఈ సంవత్సరం ప్రారంభంలో టిక్‌టాక్ కూడా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌ను అమెరికాకు విక్రయించడానికి అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..