భారత ప్రధాని మోడీని అభినందించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్.. ఎందుకంటే..
Maldives President Muizzu: మాల్దీవుల దేశం భారత్ తో బంధాలను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు భారత్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయి.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చి మరి తమ దేశంలో పర్యటించాలని కోరారు..
భారతదేశానికి వరుసగా రెండవ అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధాని మోదీని అభినందించారు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 25, 2025) మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో సహకారాన్ని ఏకీకృతం చేయడంపై దృష్టి సారించారు. కొంతకాలంగా అశాంతి నెలకొన్న తర్వాత సంబంధాలలో ఇది ఒక పెద్ద మలుపుగా మారింది. శనివారం జరిగే దేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా పాల్గొంటారు.
దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆతిథ్యం ఇస్తున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీ నిలవనున్నారు. 2023 చివరలో “ఇండియా అవుట్” ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజు ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

