AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలంబో విమానంలో ఆరుగురు అనుమానితులు.. పహల్గామ్‌ దాడితో సంబంధాలున్నట్టు అనుమానం!

పహల్గామ్‌లో నరమేథం సృష్టించిన ఉగ్రవాదుల కోసం భారత్‌ వేట మొదలుపెట్టింది. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. చెన్నై నుంచి కొలంబో వచ్చిన విమానంలో తనిఖీలు చేశారు. పహల్గామ్‌ దాడితో సంబంధం ఉన్న ఆరుగురు అనుమానితులను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో విమానంలో సోదాలు చేసినట్టు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ప్రకటన విడుదల చేసింది.

కొలంబో విమానంలో ఆరుగురు అనుమానితులు.. పహల్గామ్‌ దాడితో సంబంధాలున్నట్టు అనుమానం!
Colombo Bandaranaike International Airport
Balaraju Goud
|

Updated on: May 03, 2025 | 5:27 PM

Share

పహల్గామ్‌లో నరమేథం సృష్టించిన ఉగ్రవాదుల కోసం భారత్‌ వేట మొదలుపెట్టింది. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. చెన్నై నుంచి కొలంబో వచ్చిన విమానంలో తనిఖీలు చేశారు. పహల్గామ్‌ దాడితో సంబంధం ఉన్న ఆరుగురు అనుమానితులను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో విమానంలో సోదాలు చేసినట్టు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ప్రకటన విడుదల చేసింది. సోదాల కారణంగా సింగపూర్‌ వెళ్లాల్సిన విమానం ఆలస్యమయినట్టు వివరణ ఇచ్చింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం తోపాటు పొరుగు దేశాలలో భద్రతా అప్రమత్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే చెన్నై నుండి కొలంబోకు వస్తున్న విమానంలో ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో శనివారం(మే 3) శ్రీలంకలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ సోదాలు నిర్వహించారు. భారత నిఘా వర్గాల సమాచారం ఆధారంగా విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

చెన్నై నుండి శ్రీలంక రాజధాని కొలంబోకు వస్తున్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం (UL122) శనివారం మధ్యాహ్నం భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ విమానంలో ఉగ్రవాదులు ప్రయాణించే అవకాశం ఉందని భారత ఏజెన్సీలు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ ద్వారా శ్రీలంక అధికారులకు తెలియజేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. దీంతో ఆరుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్‌ దాడితో వీరికి సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ అనుమానితులు భారతదేశం నుండి శ్రీలంకకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నారు. అంతర్జాతీయ భద్రతా సంక్షోభాన్ని నివారించడంలో భారత భద్రతా సంస్థల ఈ అప్రమత్తత ముఖ్యమైన పాత్ర పోషించింది. విమానంలో ఎవరైనా ఉగ్రవాది పట్టుబడ్డాడా లేదా అనేది ఇంకా ధృవీకరించనప్పటికీ, భారత్-శ్రీలంక భద్రతా సంస్థలు సంయుక్తంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని స్పష్టమవుతోంది. భారత నిఘా వర్గాల సమాచారం రెండు దేశాల మధ్య పెరుగుతున్న భద్రతా సహకారాన్ని సూచిస్తుందని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు. కొలంబో విమానాశ్రయంలో తీసుకున్న ఈ చర్య ఇప్పుడు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని స్పష్టమవుతోంది. భారత్ సకాలంలో ఇచ్చిన సమాచారంతో భారీ ముప్పును నివారించడంలో సహాయపడింది. దక్షిణాసియాలో ఉగ్రవాద కార్యకలాపాలను గతంలో కంటే ఇప్పుడు మరింత తీవ్రంగా పరిగణిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..