Bathukamma Celebrations: జర్మనీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. విదేశీ గడ్డపై ఉట్టిపడిన తెలుగుదనం

బతుకమ్మ పండగ ఒక తెలంగాణలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకొంటున్నారు. ఖండాంతరాలు దాటినా తెలంగాణ ఆడపడుచులు తమ మూలాలను ఏ మాత్రం మర్చిపోకుండా..

Bathukamma Celebrations: జర్మనీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. విదేశీ గడ్డపై ఉట్టిపడిన తెలుగుదనం
Bathukamma Celebrations In Germany

Updated on: Oct 06, 2022 | 3:21 PM

బతుకమ్మ పండగ ఒక తెలంగాణలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకొంటున్నారు. ఖండాంతరాలు దాటినా తెలంగాణ ఆడపడుచులు తమ మూలాలను ఏ మాత్రం మర్చిపోకుండా విదేశీ గడ్డలపైనా బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకొంటున్నారు. ఇలా జర్మనిలో స్థిరపడిన తెలుగువారు కూడా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణలో మాదిరిగా గూనుగుపూలతో కాకున్నా జర్మనీలో దొరికే పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు అక్కడి మహిళలు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడారు.

ప్రస్తుతం కరోనా లేని కారణంగా అక్కడి మహిళలు బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కరోనా లేని కారణంగా కోవిడ్‌ నియమాలను పాటిస్తూ జర్మనీలో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకుంటున్నట్లు జర్మనీలోని హాంబర్గ్‌కు చెందిన హరిత ముదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు. తెలుగు కమ్యూనిటీ హాంబర్గ్ అక్టోబర్ 3వ తేదీన జర్మనీలోని హాంబర్గ్‌లో బతుకమ్మ, దసరా 2022 కార్యక్రమాన్ని జరుపుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్‌ నియమాలను పాటిస్తూ ప్రజలు ఉత్సాహంతో ముందుకు రావడం, మునుపటిలాగే వేడుకలలో చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ సారి 200మందికిపైగా పెద్దలు, పిల్లలతో సహా బతుకమ్మ, దసరా వేడుకలను అక్టోబర్‌ 3న సద్దుల బతుకమ్మ ఎంతో ఉత్సాహంగా జరుపుకొన్నట్లు ఆమె వెల్లడించారు.

Bathukamma Celebrations In Germany

ఈ వేడుకల్లో మేనేజ్‌మెంట్‌ టీమ్‌లో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని హరిత తెలిపారు. అయితే మన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడం, దీనిని మన భవిష్యత్తు తరాలకు అందించడమేనని వ్యాఖ్యానించారు. మా మాతృభూమి భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ మన పిల్లలు మన సంస్కృతిని నేర్చుకునేలా చేయడానికి మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ వేడుకలో భాగంగా వివిధ ఎత్తుల బతుకమ్మలను తయారు చేశామని, ముఖ్యంగా 1 మీటర్ ఎత్తు బతుకమ్మ, 10 చిన్న మధ్య తరహా బతుకమ్మలను తయారు చేయడం ఇది మొదటిసారి అని అన్నారు. నాకు తెలిసినంత వరకు జర్మనీలోని వివిధ రాష్ట్రాల్లోని అన్ని తెలుగు కమ్యూనిటీల మధ్య జర్మనీలో 1మీటర్ ఎత్తు బతుకమ్మను తయారు చేయడం ఇదే మొదటిసారి. మొత్తం యూరప్‌లో ఇంత పెద్ద ఎత్తుతో తయారు చేయడం ఇదే మొదటి సారి నేను భావిస్తున్నానని హరిత ముదిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Bathukamma Celebrations In Germany

ఈ కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ (నవరాత్రి) పూజ కూడా చేశామని, స్త్రీలందరూ ఒకచోట చేరి లలితా సహస్రనామ పారాయణం, అలాగే మహిషాసుర మర్ధిని, కొన్ని ఇతర దుర్గామాత సంబంధిత పాటలతో పాటు దుర్గామాత మంత్రాలను జపించినట్లు వెల్లడించారు. దుర్గమ్మ పూజ తర్వాత, మేము అందరు పెద్దలు, పిల్లలతో బతుకమ్మ ఆడామని, అనంతరం బతుకమ్మ నిమజ్జనం, అందరికీ రాత్రి భోజనం నిర్వహించినట్లు వెల్లడించారు. జర్మనీలోని హాంబర్గ్‌లో మా అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ, దసరా వేడుకలను ఇలా ఘనంగా జరుపుకొన్నామని ఆమె వివరించారు. ఇందులో ఈవెంట్‌ బృందం సభ్యులు శ్రీకాంత్ ముదిరెడ్డి, శ్రీనివాస్ వడ్డాడి, అంకారావు ఆత్మకూరి, రాజేంద్ర వటంబేటి, అభిలాష్ మోరేశ్వర్, నరేష్ కుజాల, మధుకర్ పబ్బిశెట్టి, సాగర్ మీసాల, ఉప్పు వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.

Bathukamma Celebrations In Germany

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి