Trending: అక్కకు ఇన్ఫెక్షన్.. పన్ను తీయించుకున్న చెల్లి.. కన్ఫ్యూస్ అవకుండా స్టోరీ చదివేయండి..
కష్టం వస్తే.. ఆ కష్టం ఎదురైన వారే భరించాలి. కాదని పక్కవాళ్లు భరిస్తామంటే అవదు కదా.. సొంత రక్త సంబంధీకులైనా మన శారీరక బాధను పంచుకోలేరు. కానీ ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం ఒకరికి కష్టం వస్తే మరొకరు..
కష్టం వస్తే.. ఆ కష్టం ఎదురైన వారే భరించాలి. కాదని పక్కవాళ్లు భరిస్తామంటే అవదు కదా.. సొంత రక్త సంబంధీకులైనా మన శారీరక బాధను పంచుకోలేరు. కానీ ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం ఒకరికి కష్టం వస్తే మరొకరు విలవిల్లాడిపోయారు. కష్టాన్ని పంచుకున్నారు. ఎలాగంటే.. సాధారణంగా ఎవరికైనా కవల పిల్లలు పుట్టినప్పుడు వారిద్దరూ ఒకేలా కనిపించాలని వారికి ఆటబొమ్మల దగ్గర్నుంచి వేసుకునే బట్టలవరకూ అన్నీ ఒకేలా ఉండేవి కొంటుంటారు తల్లిదండ్రులు. అలా చిన్నప్పటినుంచి ఒకటిగా పెరిగిన యానా, లూసీ అనే అక్కాచెల్లెలు జీవితాంతం ఒకేలా ఉండాలని భావించారు. అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండే ఆ ఇద్దరు అక్కచెల్లెలు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. అందుకే వారు ఎప్పటికే కలిసే ఉండాలని జీవితాన్ని కూడా ఒకే వ్యక్తితో పంచుకోవాలని భావించారు. ఈ క్రమంలో బెన్ అనే 37 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.
ఈ క్రమంలో వారికి ఓ చిన్న సమస్య వచ్చింది. యానా దంతం ఇన్ఫెక్షన్‌కు గురయింది. దానిని తొలగించాల్సిందిగా వైద్యులు సూచించారు. చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఒకేలా కనిపించే తాము ఇక మీదట పళ్ల విషయంలో భిన్నంగా కనిపించబోతున్నామనే ఆలోచన ఆ కవలలను కలచివేసింది. ఇకపై వారిద్దరూ ఒకేలా ఉండలేమా అన్న ఆలోచనే జీర్ణించుకోలేకపోయింది లూసీ. వెంటనే ఓ నిర్ణయం తీసుకుంది. అక్కకు లేని దంతం తనకూ వద్దనుకుంది. అక్కతోపాటే తన దంతాన్ని కూడా తీయించుకోవాలని భావించింది. దీంతో యానాతో పాటు లూసీకి కూడా పంటిని తొలగించారు వైద్యులు.
ఇక ఎప్పటికీ పళ్లతో సహా అన్నింటిలో ఒకేలా కనిపిస్తామని.. తమ భర్తతోనూ సంతోషంగా ఉంటామని ఆ అక్కాచెల్లెలు మురిసిపోయారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఫెర్త్‌లో జరిగింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.