Kili Paul: ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా(Social media), ఇంటర్నెట్(Internet) అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దేశ విదేశాల వ్యక్తుల భాషాబేధం లేకుండా తమ ప్రతిభతో స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా స్టార్స్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి సోషల్ మీడియా స్టార్స్ లో ఒకరు టాంజానియానికి చెందిన కిలీ పాల్. తాజాగా కిలీ పాల్ పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కిలీ పాల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి, కర్రలతో కొట్టారు. అయితే అతడు తనని తాను ఆ దుండుగులు దాడి నుంచి రక్షించుకున్నాడు. తనపై దాడి చేస్తున్నవారిపై తిరగబడి.. అక్కడ నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటన గురించి తెలియజేస్తూ.. కిలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గాయాలతో ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. అంతేకాదు తనపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో, కర్రలతో దాడి చేశారని.. తనను తాను రక్షించుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఈ సమయంలో తన కుడి చేతి బొటనవేలుకి కత్తి గాయాలు అయ్యాయని.. 5 కుట్లు వేశారని తెలిపాడు. తనను కర్రలు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. అయినప్పటికీ తన ప్రాణాలను రక్షించిన దేవుడికి ధన్యవాదాలుచెప్పాడు కిలీ. తనను కొట్టిన వారు పారిపోయారని.. అప్పటికే తాను గాయపడ్డానని .. తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధించమని కిలీ పోస్ట్ చేశాడు.
అయితే ఇటీవల ప్రతిభ, ఆసక్తి ఉంటె చాలు.. భాషతో పనిలేదంటూ.. సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కిలీని టాంజానియాలోని భారత హైకమిషనర్ బినయ ప్రదా సత్కరించారు. కిలీ పాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోనే 3.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని సోదరి నీమా పాల్ కూడా సోషల్ మీడియా సంచలనం. కిలీ సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేస్తాడు. బాలీవుడ్, దక్షిణ భారత సినిమా పాటలకు అతని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.
Also Read: Viral Video: అద్భుతమైన దృశ్యం.. దేవ దూతలా దివి నుంచి భువికి దిగిన తెల్లని నెమలి.. వీడియో వైరల్
Solar Eclipse 2022: సూర్యగ్రహణ ప్రభావం తొలగించుకోవడానికి.. చేయాల్సిన దానాలు, పూజలు ఏమిటంటే..