Afghanistan: ఆఫ్ఘన్‌లో మహిళపై కొనసాగుతున్న తాలిబన్ల అరాచకం.. మాజీ భర్తలే శరణ్యం.. విడాకులు రద్దు చేస్తూ హుకుం

|

Mar 07, 2023 | 3:21 PM

గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసిపోవాలంటూ తాలిబాన్‌ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై తాలిబన్‌ ప్రతినిధులు స్పందించారు.

Afghanistan: ఆఫ్ఘన్‌లో మహిళపై కొనసాగుతున్న తాలిబన్ల అరాచకం.. మాజీ భర్తలే శరణ్యం.. విడాకులు రద్దు చేస్తూ హుకుం
Afghan Women
Follow us on

ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే మహిళలు చదవకూడదంటూ విద్యాసంస్థలు మూసివేశారు. ఉద్యోగాలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం నిషేధించారు. తాజాగా మహిళల స్వేచ్ఛను హరిస్తూ విడాకులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలు కారణాలతో భర్తలకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. వారిని తిరిగి తమ భర్తల వద్దకు వెళ్లాలని, వారితోనే కలిసి జీవించాలని హుకుం జారీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.

గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసిపోవాలంటూ తాలిబాన్‌ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై తాలిబన్‌ ప్రతినిధులు స్పందించారు. అలాంటి ఫిర్యాదులు ఏమైనా వస్తే దర్యాప్తు చేపట్టి షరియా చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని తాలిబన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా ఆప్గనిస్థాన్‌లో అమెరికా బలగాలు ఉన్న సమయంలో మహిళలకు కొంత స్వేచ్ఛ లభించింది. కానీ తాలిబన్లు ఆప్గనిస్థాన్‌ను కైవసం చేసుకున్నాక మహిళలపై ఆంక్షలు పెచ్చుమీరిపోయాయి. ఇటీవల అఫ్గాన్‌ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యరాజ్య సమితి కూడా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..