ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ మీడియా హెడ్ ను కాల్చి చంపిన తాలిబన్లు.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక..

| Edited By: Phani CH

Aug 07, 2021 | 10:39 AM

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ మీడియా హెడ్ దావాఖాన్ ను తాలిబన్లు కాల్చి చంపారు. రాజధాని కాబూల్ లోని ఓ మసీదు వద్ద శుక్రవారం సాయంత్రం ఆయనపై దాడి చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ మీడియా హెడ్ ను కాల్చి చంపిన తాలిబన్లు.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక..
Talibans
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ మీడియా హెడ్ దావాఖాన్ ను తాలిబన్లు కాల్చి చంపారు. రాజధాని కాబూల్ లోని ఓ మసీదు వద్ద శుక్రవారం సాయంత్రం ఆయనపై దాడి చేశారు. ఆఫ్ఘన్ దళాల వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తామని వారు ఇదివరకే హెచ్చరించారు. ఇటీవలి నెలల్లో తాలిబన్లు మొదటి సారిగా కాబూల్ నగరానికి చేరువగా వచ్చారు. ధావన్ ఖాన్ మెనాపాల్ అనే ఈ అధికారి మృతికి తమదే బాధ్యత అని వారు ప్రకటించుకున్నారు. వీరిని సోషల్ మీడియాలో తరచూ విమర్శిస్తూ.. జోకులు వేసే ఈ అధికారి ఆఫ్ఘన్ లో పాపులర్ అయిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మృతి షాకింగ్ ఘటన అని, తాలిబన్లు పిరికి చర్యకు పాల్పడ్డారని అధ్యక్షుని మాజీ అధికార ప్రతినిధి సిద్దిఖీ వ్యాఖ్యానించారు. ఇది అత్యంత దారుణమని, మరో దేశ భక్తుడిని కోల్పోయామని ఆయన అన్నారు. ముజాహిదీన్లు జరిపిన స్పెషల్ ఎటాక్ లో ఈ అధికారి మరణించాడని తాలిబన్ల అధికార ప్రతినిధి జహీబుల్లా ముజాహిద్ తన సందేశంలో పేర్కొన్నాడు. ఇటీవల రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మద్ ఇంటి వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కూడా తమదే బాధ్యత అన్నాడు.

బిస్మిల్లా మహమ్మద్ గాయపడకుండా తప్పించుకున్నారని..కానీ ప్రతీకార దాడులు ఆగవని జహీబుల్లా పేర్కొన్నాడు. కాగా ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న నిమ్ రోజ్ ప్రావిన్స్ రాజధాని జరాంజ్ నగరాన్ని తాలిబన్లు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుసగా ఇక రాజధానులను తాము హస్తగతం చేసుకుంటామని వారు ప్రకటించారు. ఆఫ్ఘన్ పరిస్థితిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి న్యూయార్క్ లో సమావేశమైన తరుణంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Golfer Aditi Ashok: తుదివరకూ పోరాడి ఓడిన అదితి.. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రసృష్టించే ఛాన్స్‌ మిస్

కేరళలో వరకట్న బాధితురాలు విస్మయ సూసైడ్ కేసు.. భర్తపై వేటు.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం..