Super Plant Fights Pollution: కాలుష్యాన్ని నియంత్రించే ఖతర్నాక్ ప్లాంట్.. ఈ సూపర్ మొక్క గురించి తెలిస్తే షాకే!

| Edited By: Rajesh Sharma

Feb 23, 2021 | 2:21 PM

చెట్లు మానవజాతి ప్రగతికి మెట్లు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని ప్రభుత్వం అధికారులు పిలుపునిస్తున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా...

Super Plant Fights Pollution: కాలుష్యాన్ని నియంత్రించే ఖతర్నాక్ ప్లాంట్.. ఈ సూపర్ మొక్క గురించి తెలిస్తే షాకే!
Follow us on

Super Plant Fight Air Pollution: చెట్లు మానవజాతి ప్రగతికి మెట్లు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని ప్రభుత్వం అధికారులు పిలుపునిస్తున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా తీసుకొస్తున్నారు కూడా.. రోజు రోజుకీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. విపరీతమైన ఎండలు, భారీ వర్షాలు.. మంచు తుఫాన్లు ఏవీ కాలానికి అనుగుణంగా రావడం లేదు. దీనికి కారణం వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం.. మొక్కలు నరికివేత అంటూ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న గ్లోబలైజేషన్ తో వాతావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. అయితే ఓ పరిశోధక బృందం వాయు కాలుష్యం నుంచి రక్షించడంలో కొన్ని అత్యంత ప్రభావవంతమైన మొక్కలను కనిపెట్టే ప్రయత్నం చేసింది.

ఈ పరిశోధనల్లో ఆరెంజ్ కోటోనేస్టర్ మొక్క వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. హెడ్జెస్ ప్లాంట్.. దట్టంగా పందిరిలా పెరిగే ఈ మొక్క ఆకులు కాలుష్య కారకాలను శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధనల్లో కోటోనేస్టర్ మొక్కను వాయు కాలుష్యంపై అత్యంత ప్రభావం చూపిస్తుందని వెల్లడైందని పరిశోధక బృందం పేర్కొంది. గాల్లో పేరుకుపోయిన కాలుష్య కారకాలను ఫీల్టర్ చేయడంలో ఈ మొక్క సాయపడుతుందని వివరించారు. గాలిని శుభ్రపరచడంలో అన్ని మొక్కల కంటే ఈ కొటోనెస్టర్ మొక్క 20శాతం ఎక్కువ చూపించిందని గుర్తించారు.

పర్యావరణంలోని గాలిలో కాలుష్యాన్ని నియంత్రించగల శక్తి చెట్లకు ఉంది. కార్భన్ డైయాక్సైడ్ ను చెట్లు పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును మనకు అందిస్తాయి. అయితే తాజాగా ఆరెంజ్ కోటోనేస్టర్ అనే ఈ మొక్క కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకోవడమే కాదు.. వాహనాలు వెదజల్లే పొగ లోని గాలి కాలుష్యాన్ని కూడా వెంటనే పీల్చుకుంటుంది తమ పరిశోధనల్లో తేలిందని శాస్త్రజ్ఞులు చెప్పారు. కోటోనేస్టర్ జాతుల్లో ఒకటైన కోటోనేస్టర్ ఫ్రాంచెటి పసుపు వర్ణం కాయలతో పొదలుగా పెరిగే ఈ మొక్కలు ఎప్పటికప్పుడు గాలిని ఫిల్టర్ చేస్తుందట. ఈ విషయంపై పరిశోధనలు చేసిన న్యూయార్క్ లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ, యూకేలో యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ కు చెందిన పరిశోధక బృందం ప్రకటించింది.

నైరుతి చైనాలో ఎక్కువుగా కనిపించే ఈ హెడ్జ్ ప్లాంట్.. వాహనాల నుంచి వెలువడే కాలుష్య వ్యర్థాలను పీల్చుకుని గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడుతుందని కనుగొన్నారు. పట్టణాల్లో పెరిగిపోతున్న జనాభా.. వాహన కల్చర్ నేపథ్యంలో గాలి కాలుష్య నివారణకు ఏ మొక్కలు ఉపయోగపడతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా గత 10ఏళ్లునుంచి పరిశోధన చేస్తున్నారు.

అయితే ఈ హెడ్జ్ జాతి మొక్కలు ట్రాఫిక్ తక్కువ వీధుల్లో అంతగా ప్రభావం చూపించడం లేదని.. అత్యంత గాలి కాలుష్యంగల ప్రాంతాల్లోని గాలిలోని కాలుష్య కారకాలను మాత్రమే పీల్చుకుంటుందని తమ పరిశోధన ద్వారా తెలిసిందని చెప్పారు.ఈ మొక్కను ఇంటి ముందు అందం కోసం పెంచుకోవడానికి విదేశాలకు చైనా నుంచి తీసుకుని వెళ్లారు. మూడు మీటర్ల మేర .. పొదల్లా పెరిగే ఈ మొక్క ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంది. ఒవెల్ షేప్ లో చిన్నగా అందంగా ఉండే ఆకులు.. వాటి మీద పసుపు, గులాబీ ఇలా రకరకాల వర్ణాలతో పువ్వులు ఈ చెట్టుకు మరింత అందం తీసుకొస్తుంది. జూన్‌ నెలలో గులాబీ లేదా తెలుపు రేకులతో ఎరుపు-నారింజ బెర్రీలుగా పెరుగుతూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది.

Also Read:

అదే పనిగా కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త.. మీకు గుండె పోటు వచ్చే అవకాశం ఉంది..

పాకిస్థాన్ తో చేతులు కలిపిన కాంగ్రెస్ నేత రాహుల్, బీజేపీ ఫైర్, ఖండించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్