Success Story: మొదటి జీతం డాలర్లలోనే తీసుకోవాలని.. ప్రపంచ బ్యాంక్ లో జాబ్ సంపాదించిన భారతీయ యువకుడు.. సక్సెస్ స్టోరీ  మీ కోసం

|

Sep 24, 2022 | 6:30 PM

తాను భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోలేదని.. తన మొదటి జీతం డాలర్లలో ఉండాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పాడు వత్సల్'. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 

Success Story: మొదటి జీతం డాలర్లలోనే తీసుకోవాలని.. ప్రపంచ బ్యాంక్ లో జాబ్ సంపాదించిన భారతీయ యువకుడు.. సక్సెస్ స్టోరీ  మీ కోసం
Vatsal Nahata
Follow us on

Success Story: కష్టపడి పనిచేయడాన్నినమ్మేవారు ఎప్పుడూ జీవితం పై ఆశని వదులుకోరు. కృషి పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నవారి జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. అలాంటి వారిలో వత్సల్ నహతా ఒకరు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 23 ఏళ్ల వత్సల్ నహతా సక్సెస్ కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నిజానికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేయడం వత్సల్ కల. అలాంటి పరిస్థితుల్లో తన కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు. 600 కోల్డ్ ఇమెయిల్‌లు, 80 కాల్స్ తర్వాత.. వత్సల్ నహతా చివరకు తన డ్రీమ్ జాబ్‌ను పొందారు. వత్సల్  స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ  గురించి తెలుసుకుందాం.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో వత్సల్ స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రారంభమైంది. వాస్తవానికి 2020 లో వత్సల్ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో తన చదువును పూర్తి చేశాడు.  అయితే కరోనా సృష్టించిన విలయంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడడంతో ఉద్యోగం సంపాదించడంలో అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను  తొలగించడంలో నిమగ్నమై ఉన్నాయి. అదే సమయంలో..  ఇమ్మిగ్రేషన్‌ విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కూడా కఠినంగా ఉంది. అమెరికా పౌరులకు మాత్రమే ఉద్యోగాల్లో ఇవ్వాలని ఆదేశించారు.

ఇదే విషయంపై వత్సల్ నహతా మాట్లాడుతూ.. తనకు అప్పుడు ఉద్యోగం లేదని యేల్ యూనివర్సిటీ నుంచి ఇంకో రెండు నెలల్లో గ్రాడ్యుయేట్ పట్టాను పుచ్చుకోబోతున్నాను.. ఏమి చేయాలనీ అని ఆలోచించాను. అప్పుడే తనకు ఉక్కు లాంటి దృఢ సంకల్పం ఏర్పడిందని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

తనకు అమెరికాలో ఉద్యోగం రాక పోతే యేల్ లో చదువుకుని  ఏం లాభం అని భావించినట్లు నహతా స్వయంగా  చెప్పాడు. తన పేరెంట్స్‌ ఫోన్‌ చేసి ఎలా ఉన్నావని అడిగినప్పుడు.. వారికీ తన గురించి చెప్పడం చాలా కష్టంగా మారింది’ అని చెప్పాడు. అంతేకాదు తాను భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోలేదని.. తన మొదటి జీతం డాలర్లలో ఉండాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పాడు వత్సల్’. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  రెండు నెలల వ్యవధిలో.. 1500 కంపెనీలకు దరఖాస్తులను పంపాడు. 600 కోల్డ్-ఇమెయిల్స్ వ్రాసాడు.. సుమారు 80 సంస్థల నుంచి వివిధ కాల్స్ అందుకున్నాడు.

అయితే తన ప్రయత్నాలు ఫలించలేదని.. చాలా తిరస్కరణలను ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నాడు. తన అవసరాన్ని గ్రహించి తనని తాను బలంగా మలచుకున్నట్లు.. ఆత్మవిశ్వాసంతో  మరింత పట్టుదలగా మరింత కష్టపడి పనిచేస్తినట్లు చెప్పాడు. చివరకు తన ప్రయత్నాలు ఫలించి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సంపాదించానని హర్షం వ్యక్తం చేశాడు వత్సల్ నహతా.  ‘మే మొదటి వారం వరకు.. తనకు 4 ఉద్యోగ ఆఫర్లు ఉన్నాయి. అయితే తాను ప్రపంచ బ్యాంకులో పని చేయడానికి ఎంచుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం తనకు వీసాను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంక్‌లో ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌తో కలిసి మెషీన్ లెర్నింగ్ పేపర్‌ను సహ రచయితగా చేయమని నా మేనేజర్ నాకు ఆఫర్ చేశారని పేర్కొన్నాడు.

వత్సల్ నహతా ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో పనిచేస్తున్నారు. రెండు నెలల ఆ ప్రయాణం కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పిందని అంటున్నారు.

  • ఇది నెట్‌వర్కింగ్  నిజమైన శక్తిని నాకు చూపించింది. ఇప్పుడు నా స్వభావాన్ని మార్చింది.
  • నేను ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని అమెరికాకు వలసదారుగా వెళ్లగలననే విశ్వాసాన్ని నాకు ఇచ్చింది.
  • నా ఐవీ లీగ్ డిగ్రీ మాత్రమే నన్ను ఇంత దూరం తీసుకురాగలిగింది.
  • సంక్షోభ సమయాలు (COVID-19 , ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానం) తనను మరింత అభివృద్ధి చెందిన వ్యక్తిగా సిద్ధం కావడానికి అనువైనవిగా మలచాయని పేర్కొన్నాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..