Srilanka Crisis: శ్రీలంకలో రాజుకున్న రావణకాష్టం..ఆదుకోవాలని ఐఎంఎఫ్‌తో పాటు భారత్‌కు రాజపక్సే విజ్ఞప్తి

శ్రీలంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. లంక ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికధరలపై ఆగ్రహజ్వాల రాజపక్సే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది.

Srilanka Crisis: శ్రీలంకలో రాజుకున్న రావణకాష్టం..ఆదుకోవాలని ఐఎంఎఫ్‌తో పాటు భారత్‌కు రాజపక్సే విజ్ఞప్తి
Gotabaya Rajapaksa
Follow us

|

Updated on: Apr 01, 2022 | 8:28 PM

Srilanka Crisis: శ్రీలంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. లంక ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికధరలపై ఆగ్రహజ్వాల రాజపక్సే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఆందోళనల వెనుక తీవ్రవాద శక్తుల హస్తముందని అధ్యక్షుడు గొటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) ఆరోపించారు. తమ దేశాన్ని ఆదుకోవాలని ఐఎంఎఫ్‌(IMF)తో పాటు చైనా , భారత్‌(India)కు విజ్ఞప్తి చేశారు. అధికధరలను అదుపు చేయడంలో విఫలమైన దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే తప్పంతా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన నివాసం దగ్గర జరిగిన అల్లర్ల వెనుక తీవ్రవాదుల హస్తముందని అధ్యక్షుడు రాజపక్సే ఆరోపించారు. తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.

అల్లర్ల వెనుక ఉన్న తీవ్రవాద గ్రూపులను గుర్తించినట్టు రాజపక్సే తెలిపారు. మరో ఆర్ధికసంక్షోభం నుంచి గట్టెక్కించాలని శ్రీలంక ప్రభుత్వం IMFను వేడుకుంది. శ్రీలంక అభ్యర్ధనను పరిశీలిస్తున్నామని IMF తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించాలని భారత్‌తో పాటు చైనా ప్రభుత్వాలను కూడా వేడుకున్నారు అధ్యక్షుడు రాజపక్సే. అధ్యక్ష భవనం దగ్గర అల్లర్ల కేసులో 45 మందిని కొలంబో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే పోలీసులు అమాయకులను అరెస్ట్‌ చేసి టార్చర్‌ చేస్తున్నారని శ్రీలంక విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజపక్సే సోదరుల వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజపక్సేకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. అధ్యక్ష భవనం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఓవైపు నిత్యావసర వస్తువులు చుక్కలను తాకడంతో పాటు శ్రీలంకలో కరెంట్‌ సంక్షోభం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 13 గంటల పాటు విద్యుత్‌ కోతలు విధించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు లేవని పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Read Also…  Andhra Pradesh: ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దు.. ప్రజలకు AP SPDCL విజ్ఞప్తి

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో