శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే ఎట్టకేలకకు తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేయాలని గత కొంతకాలంగా శ్రీలంకతో ఆందోళనలు మిన్నంటాయి. రాజపక్సే సోదరులు గద్దె దిగడానికి విపక్షాలు వారం రోజుల డెడ్‌లైన్ పెట్టాయి. దీంతో డెడ్‌లైన్ కంటే ముందే మహింద రాజపక్సే రాజీనామా చేశారు. గత నెల రోజుల నుంచి శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకాయి. శ్రీలంక ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. భావోద్వేగాలకు ఇది సమయం కాదు. .. హింస మరింత హింసను ప్రేరేపిస్తుంది. ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అంటూ రాజీనామాకు ముందు ట్వీట్ చేశారు మహింద రాజపక్సే.
నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో సోమవారం స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్స విధేయులు సోమవారం కర్రలతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని రాజపక్స విజ్ఞప్తి చేశారు. మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు.
While emotions are running high in #lka, I urge our general public to exercise restraint & remember that violence only begets violence. The economic crisis we’re in needs an economic solution which this administration is committed to resolving.
— Mahinda Rajapaksa (@PresRajapaksa) May 9, 2022
శ్రీలంక పార్లమెంట్‌లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత మళ్లీ రగడ మొదలైంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధ్యక్షుడు గొటబాయాఏ రాజపక్సే రాజీ ఫార్ములాను విపక్షాల ముందు పెట్టారు. తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని విపక్ష నేత సజిత్ ప్రేమదాసను కోరారు. కాని ప్రధాని పదవిని చేపట్టడానికి నిరాకరించారు సుజిత్ ప్రేమదాస. ఆహార, ఇంధన, ఔషధాల కొరతతోపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దానికి తోడు అధికార పక్షంపై ప్రతిపక్షాలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక క్లిక్ చేయండి
ఇదీచదవండి
Char Dham Yatra 2022: చార్ ధామ్ యాత్రలో విషాదం.. ఆరు రోజుల్లో 16 మంది భక్తుల మృతి.. కారణం ఏంటంటే..?