AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. భారీ ట్రక్కులో 64 మృత దేహాల మధ్య..14 మంది సజీవంగా..

మొజాంబిక్ లోని వాయువ్య టేటే ప్రావిన్స్ లో జరిగింది ఓ దారుణం. ఓ కార్గో కంటెయినర్ (భారీ ట్రక్కు) లో 64 మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. ఆ డెడ్ బాడీస్ మధ్య 14 మంది సజీవంగా.. దిక్కుతోచని స్థితిలో కనబడి వారు షాక్ తిన్నారు. ఈ రాష్ట్ర సరిహద్దుల్లో మలావీ నుంచి వస్తున్న ఈ వాహనాన్ని పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపివేసి తనిఖీ చేసినప్పుడు ఈ ఘోరం కనబడింది. సరిహద్దుల్లోని జింబాబ్వే నుంచి వఛ్చిన ఇథియోపియన్లుగా […]

దారుణం.. భారీ ట్రక్కులో 64 మృత దేహాల మధ్య..14 మంది సజీవంగా..
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 3:34 PM

Share

మొజాంబిక్ లోని వాయువ్య టేటే ప్రావిన్స్ లో జరిగింది ఓ దారుణం. ఓ కార్గో కంటెయినర్ (భారీ ట్రక్కు) లో 64 మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. ఆ డెడ్ బాడీస్ మధ్య 14 మంది సజీవంగా.. దిక్కుతోచని స్థితిలో కనబడి వారు షాక్ తిన్నారు. ఈ రాష్ట్ర సరిహద్దుల్లో మలావీ నుంచి వస్తున్న ఈ వాహనాన్ని పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపివేసి తనిఖీ చేసినప్పుడు ఈ ఘోరం కనబడింది. సరిహద్దుల్లోని జింబాబ్వే నుంచి వఛ్చిన ఇథియోపియన్లుగా వీరిని భావిస్తున్నారు. ఈ వాహనంలో కిక్కిరిసి ఉన్నట్టు కుక్కిన వీరు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ కంటెయినర్ డ్రైవర్ ను, అతని అసిస్టెంటును పోలీసులు అరెస్టు చేశారు. మొజాంబిక్ దేశంలోకి ఇథియోపియన్ల అక్రమ ఎంట్రీకి ఎవరు వీలు కల్పించారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ వాహనంలో అనేకమంది ఇథియోపియన్లు ప్రయాణిస్తున్నట్టు దక్షిణాఫ్రికా లోని ఇథియోపియన్ ఎంబసీ ద్వారా తమకు సమాచారం అందిందని అడ్డిస్ అబాబాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ట్రాజెడీ పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సజీవంగా ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపాధికోసం పొట్ట చేతబట్టుకుని అనేకమంది ఇథియోపియన్లు దొంగచాటుగా మొజాంబిక్ దేశంలోకి ప్రవేశిస్తుంటారు. ఇదే అదనని ఫ్రాడ్ స్టర్స్,, వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని.. వీరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజి అక్రమ మార్గాల ద్వారా తరలిస్తుంటారు.

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?