America: అమెరికాలో కాల్పులు కలకలం.. ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు

అమెరికాలో (America) మరోసారి కాల్పులు జరిగాయి. షికాగో (Chikago) సమీపంలోని హైలాండ్‌ పార్క్‌లో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు....

America: అమెరికాలో కాల్పులు కలకలం.. ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు
Gun

Edited By:

Updated on: Jul 05, 2022 | 6:26 AM

అమెరికాలో (America) మరోసారి కాల్పులు జరిగాయి. షికాగో (Chikago) సమీపంలోని హైలాండ్‌ పార్క్‌లో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు. పరేడ్‌ జరగుతున్న ప్రదేశం సమీపంలోని ఓ రిటైల్‌ స్టోర్‌ నుంచి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. గతంలో జరిగిన ఘటనలో ఒక్లహామాలోని తుల్సా హాస్పిటల్ కు వచ్చిన దుండగుడు.. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి తీవ్ర ఆగ్రహంతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే సమయంలో పెన్సిల్వేనియాలో పిట్స్‌టన్ వాల్‌మార్ట్ లో, కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్ లో హైస్కూల్ లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అంతకు ముందు కూడా ఓక్లహోమాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ దారుణం జరిగింది. విచక్షణ కోల్పోయిన 26 ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్క సారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి