Sirisha Bandla: నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు

|

Jul 11, 2021 | 3:32 PM

అంతరిక్షంలో చరిత్ర సృష్టించబోతున్నారు తెలుగు తేజం శిరీష. తొలిసారిగా స్పేస్‌ టూరిజానికి రెడీ అయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష..

Sirisha Bandla: నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు
Bandla Shirisha Thumb
Follow us on

అంతరిక్షంలో చరిత్ర సృష్టించబోతున్నారు తెలుగు తేజం శిరీష. తొలిసారిగా స్పేస్‌ టూరిజానికి రెడీ అయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష.. రోదసీపై కాలు పెట్టబోతున్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారతీయ వనితగా..రికార్డ్‌ సృష్టించబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హోదాలో..శిరీష ఈ స్పేస్ వాక్ చేయనున్నారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

శిరీష అంతరిక్షయానంపై కుటుంబసభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి మనమ్మాయ్..స్పేస్‌లోకి వెళ్లడం గర్వకారణమని అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ నుంచి రోదసీలో అడుగుపెట్టిన నాలుగో వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్నారు శిరీష. దీంతో ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని..అమెరికా సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పేస్‌ టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ 17ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. కొన్ని ప్రయోగాలు విఫలమైనా చివరికి రోదసిలోకి వెళ్లే టెక్నాలజీని ఒడిసి పట్టింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన ఈ సంస్థ..తొలిసారి మానవసహిత ప్రయోగానికి సిద్ధమైంది. భూమి నుంచి స్పేస్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ప్లేన్ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ఇవాళ ఆ వ్యోమనౌక VSS యూనిటీ-22ను నింగిలోకి పంపనుంది. న్యూ మెక్సికో ప్రైవేట్‌ స్పేస్‌పోర్ట్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.

ప్లేన్‌ కేరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాక దాన్నుంచి స్పేస్ ఫ్లైట్‌ వేరుపడుతుంది. రాకెట్‌‌‌‌‌‌‌‌లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక నిలువుగా వెళ్లే ఫ్లైట్ అడ్డంగా మారుతుంది. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అక్కడ దానిలోని వ్యోమగాములు జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు. కొంత సమయం అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మొత్తం 90నిమిషాల పాటు కొనసాగనుంది ఈ అంతరిక్ష యాత్ర. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు ఆ వ్యోమనౌకలో ప్రయాణించబోతున్నారు. ఆ టీమ్‌లో మన తెలుగమ్మాయి గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష కూడా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే.. ముందే ఈ టీమ్ అంతరిక్షంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

Also Read:  డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పట్టు తప్పిందో ప్రాణాలు గోవిందా..!

బ్యాంకులో ఉద్యోగం.. ఈ నెల 4వ తేదీన నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం..!