International travel ban : భారత్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్న దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరిపోయింది

International travel ban : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ వివిధ దేశాలు భారత్ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరింది.

International travel ban : భారత్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్న దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరిపోయింది
International Travel Ban

Edited By: Phani CH

Updated on: Apr 22, 2021 | 9:41 PM

International travel ban list : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ వివిధ దేశాలు భారత్ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరింది. దుబాయ్ – భారత్ మధ్య విమాన సర్వీసులను నిలిపేస్తూ యుఏఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఏప్రిల్ 25 నుంచి 10 రోజులపాటు భారత్ కు దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నడువవు. భారత దేశంలో పెరిగిపోతోన్న కోవిడ్-19 కేసుల కారణంగా నిలిపివేత నిర్ణయం తీసుకుంది యూఏఈ. ఇలాఉండగా, ఇటీవలే బ్రిటన్‌ కూడా భారత్‌ ను రెడ్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు బ్రిటన్‌కు నడిచే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విషయాన్ని గమనించాలని సూచించింది. విమానాల రీషెడ్యూల్‌ తేదీలు, రీఫండ్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుపుతామని విమానయాన సంస్థ వెల్లడించింది. అలాగే భారత్ – హాంకాంగ్​ మధ్య విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇటీవల హాంకాంగ్​ విమానయాన శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబై నుంచి హాంకాంగ్​ వెళ్లే విమానాలన్నింటినీ మే 2 వరకు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ సైతం భారత విమానాలపై నిషేధం విధించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధం, ఎన్నికల కమిషన్ ఆదేశం, తక్షణమే అమలు

ఆక్సిజన్ అయిపోవడానికి 3 గంటలే ఉంది, ఢిల్లీ ఆకుపత్రి బెడ్ పై నుంచి ఆప్ నేత వీడియో