Self Driving Bus: ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. ఆవిష్కృతమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు

|

Nov 26, 2022 | 1:14 PM

డ్రైవర్‌లేని బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే సౌత్‌ కొరియాకి వెళ్ళాల్సిందే. అదేదో అంతరిక్షయానం అనుకునేరు. రోడ్డుపైనే. సేఫ్‌గా తీసుకెళుతుంది. కాకపోతే డ్రైవరు.. కండక్టరు..

Self Driving Bus: ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. ఆవిష్కృతమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు
Driverless Bus
Follow us on

డ్రైవర్‌లేని బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే సౌత్‌ కొరియాకి వెళ్ళాల్సిందే. అదేదో అంతరిక్షయానం అనుకునేరు. రోడ్డుపైనే. సేఫ్‌గా తీసుకెళుతుంది. కాకపోతే డ్రైవరు, కండక్టరు తదితరాలేవీ అక్కర్లేకుండా అంతా స్మూత్‌గా దానికదే సాగిపోతుంది. కాకపోతే ఆ డ్రైవర్‌ రహిత బస్సు ఎక్కాలంటే మీరు సౌత్‌ కొరియాకి వెళ్లాల్సిందే. అవును.. మీరు విన్నది నిజమే. దక్షిణ కొరియాలో బస్సులో ప్రయాణించాలంటే ఇకపై డ్రైవర్‌ అవసరమే లేదు. సౌత్‌ కొరియాలో ఆవిష్కృతమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆటోమొబైల్‌ రంగంలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. డ్రైవర్‌లేని బస్సుని దక్షిణ కొరియా ఆవిష్కరించింది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని రుజువు చేస్తోంది దక్షిణ కొరియాకిచెందిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు. నిర్ధారిత రూట్‌లో ఈ బస్సుని రెండురోజుల క్రితమే ఆవిష్కరించారు. బొమ్మ బస్సులా కనిపించే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు సాధారణ బస్సులకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. డ్రైవర్‌తో పనిలేకుండా తన గమ్యస్థానానికి సేఫ్‌గా చేరుకుంటుంది. ఈ బస్సు కొనలు రౌండ్‌గా ఉండి, పెద్ద పెద్ద విండోస్‌తో ప్రత్యేకంగా ఉంటుంది.

ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ హుండై కంపెనీ తయారుచేసిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీని అత్యంత తక్కువ ధరకు అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమే ఈ బస్సు లక్ష్యమని అంటోంది తయారీ కంపెనీ. ప్రస్తుతానికి 3.4 కిలోమీటర్ల దూరం ఈ డ్రైవర్‌లేని బస్సులో ప్రయాణించొచ్చు. దక్షిణ కొరియాలోని సియోల్‌ డౌన్‌ టౌన్‌కి 3.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 20 నిముషాల సమయం పడుతుంది. భవిష్యత్తులో ట్రక్‌లు, ఇతర వాహనాలను కూడా డ్రైవర్‌ రహితంగా తయారుచేయాలని భావిస్తోంది ఈ కంపెనీ. బస్సు చాలా స్మూత్‌గా ప్రయాణిస్తోందని, బస్సు స్టార్ట్‌ అయ్యేటప్పుడు మాత్రమే చిన్న జర్క్‌ ఉంటుందని అంటున్నారు ఆటోమొబైల్‌ హెడ్‌ జియాంగ్‌ సియోంగ్‌ జిన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..