Iran Man: 67 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి.. అతని ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లు చూసి శాస్త్రవేత్తలు షాక్

|

Jan 21, 2022 | 10:50 AM

87 Year old Iran Man: సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత పరిశుభ్రత, ఆహారం విషయంలో ఆ జాగ్రత్తలు మరింత అధికమయ్యాయి..

Iran Man: 67 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి.. అతని ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లు చూసి శాస్త్రవేత్తలు షాక్
87 Year Old Iranian Man
Follow us on

87 Year old Iran Man: సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత పరిశుభ్రత, ఆహారం విషయంలో ఆ జాగ్రత్తలు మరింత అధికమయ్యాయి. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎలాంటి పరిశుభ్రత గానీ, మంచి ఆహారం కానీ తీసుకోకుండానే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. 87 ఏళ్ల వయసులో కూడా అతను ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు.

ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తింటూ, నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. గత 67 ఏళ్లుగా అతని జీవన శైలి ఇదేనట. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతను ఒంటరిగానే గడుపుతాడు. చాలాకాలం అతను సోరంగంలోనే జీవించాడట. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్యర్యపోయిన దేజ్‌గా గ్రామస్తులు ఆ వృద్ధుడి కోసం ఒక పూరి గుడిసెను నిర్మించి ఇచ్చారట. కాగా టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే అతను 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవని అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడని తేల్చారు. కాగా ఆ వృద్ధుడికి స్థానిక పరిపాలనాధికారులు సైతం అండగా నిలిచారు.. అతన్ని ఎవరూ ఇబ్బంది పెట్టవద్దంటూ అక్కడి గవర్నర్‌ స్వయంగా ప్రజలను కోరడం విశేషం.

Also Read:

Beetroot in Winters: చలికాలంలో సూపర్ ఫుడ్ బీట్ రూట్.. రోజు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

Weight Loss Diet: ఆకుకూరలతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..