AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi Arabia: ఆ దేశంలో మరీ ఇంత దారుణమా..? 10 రోజులలోనే 12 మందికి ఉరి శిక్ష..

దుబాయ్, ఖతర్, అఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాలలో నేరం చేసిన వారికి ఎంతటి దారుణమైన శిక్షలను విధిస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. అతి ఎంత పాపమో అని అనుకొని ..

Saudi Arabia: ఆ దేశంలో మరీ ఇంత దారుణమా..? 10 రోజులలోనే 12 మందికి ఉరి శిక్ష..
Death Sentence
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 22, 2022 | 1:28 PM

Share

దుబాయ్, ఖతర్, అఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాలలో నేరం చేసిన వారికి ఎంతటి దారుణమైన శిక్షలను విధిస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. అతి ఎంత పాపమో అని అనుకొని వారుండరు మరి. కానీ ఆ దేశాలలో అది శరామామూలే. అలాంటి ఘటనలు వెంటవెంటన జరిగితే..? గుండె తరుక్కుపోవాల్సిందే కదా.. అలాంటిది సౌదీ అరేబియా ప్రభుత్వం గత 10 రోజుల్లోనే డ్రగ్స్ సంబంధిత నేరాలకు 12 మందిని ఉరితీసింది. చనిపోయిన ఈ 12 మందిలో కొందరిని కత్తితో నరికి కూడా చంపినట్లు వార్తాకథనాలు వస్తున్నాయి.

అహింస, మాదక ద్రవ్యాల ఆరోపణలపై ఈ 12 మంది ముందుగా కొంతకాలం జైలు శిక్షను అనుభవించారు. తరువాత సౌదీ న్యాయస్థానం వీరికి మరణ శిక్ష విధించింది. అయితే చనిపోయిన వారిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డానియన్లు ఇంకా ముగ్గురు సౌదీలు ఉన్నారు. హత్యలు, మిలిటెంట్ గ్రూపులకు, ఇతర నేరాలకు పాల్పడిన 81 మందిని సౌదీ అరేబియా అధికారులు ఈ ఏడాది మార్చిలో ఉరితీసింది. సౌదీ అరేబియా ఆధునిక చరిత్ర ఇదే అతి పెద్ద  సాముహిక ఉరి  శిక్షగా అప్పట్లో పలు వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి.

కాగా, ఇటువంటి దారుణ శిక్షలను అమలు చేయడం తగ్గిస్తామని సౌదీ అరేబియా ప్రమాణం చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత… ఇటీవలి రోజుల్లోనే ఈ ఉరిశిక్ష వెలుగులోకి వచ్చింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు 2018 టర్కీలో యుఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని సౌదీ డెత్ స్క్వాడ్ హత్య చేసిన నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ ప్రమాణం చేసింది. అయితే సౌదీలో హత్య లేదా నరహత్యకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్షను విధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..